అసదుద్దీన్ ను ఉరి తీయాలి

అసదుద్దీన్ ను ఉరి తీయాలి

భారత మాతాకీ జై అన్న నినాదాన్ని తాను ఎట్టి పరిస్థితుల్లోనూ చేయబోనని చెప్పిన ఎంఐఎం నాయకుడు అసదుద్దీన్ ఒవైసీని చట్ట ప్రకారం ఉరితీయాలని శివసేన ఈ రోజు డిమాండ్ చేసింది. గత వారం లాతూర్ లో అసదుద్దీన్ ఒవైసీ తన గొంతులో కత్తి దిగేసినా భారత మాతాకీ జై అనను అని చెప్పిన సంగతి తెలిసిందే. దీనిపై శివసేన అధికారిక పత్రిక సమ్నా ఈ రోజు సంపాదకీయంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ పై కూడా విమర్శలు గుప్పించింది. ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్న అసదుద్దీన్ ఒవైసీని రాష్ట్రంలో స్వేచ్ఛగా సంచరించేందుకు ఎందుకు అనుమతిస్తున్నారని ప్రశ్నించింది. సింధు దుర్గలో ఆందోళన చేస్తున్న ఎమ్మెల్యేలపై లాఠీ చార్జి చేశారు...కానీ దేశ వ్యతిరేక ప్రకటనలు చేస్తున్న ఒవైసీని మాత్రం స్వేచ్ఛగా వదిలేశారని విమర్శించింది. దేశంలో ముస్లింల స్థితి ఇలా ఎందుకు ఉందో ఒక్కసారి గమనిస్తే అందుకు కారణం ఒవైసీ వంటి వ్యక్తులేనని అర్ధమౌతుందని పేర్కొంది.

మరోవైపు ఉత్తరప్రదేశ్‌కు చెందిన భాజపా నేత శ్యామ్‌ ప్రకాశ్‌ ద్వివేది ఒవైసీ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో స్పందించారు. ఒవైసీ నాలుక కోసి తెచ్చినవారికి రూ.కోటి ఇస్తానని ప్రకటించారు. ఒవైసీ ఓ ఉగ్రవాదని, ఆయనకు ఈ దేశంలో నివసించే హక్కు లేదని తీవ్రంగా విరుచుకుపడ్డారు.  ప్రముఖ ఆధ్యాత్మిక గురువు పరిపూర్ణానంద స్వామి కూడా  ఒవైసీపై మండిపడ్డారు. అసద్ ఓ పాకిస్థానీ అని... అందుకే ఆయన భారత మాతకు జైకొట్టడానికి ఇష్టపడడం లేదని అన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు