మనోజ్ ఏదో అనుకుంటే..

మనోజ్ ఏదో అనుకుంటే..

అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి అన్నట్లు తయారైంది మంచు మనోజ్ పరిస్థితి. తన ఇమేజ్‌కు పూర్తి భిన్నంగా.. తాను కెరీర్లో ఇప్పటిదాకా పోషించని సరికొత్త పాత్ర చేసిన ‘శౌర్య’పై అతను ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. చాలా కష్టపడి చేసిన ఈ సినిమా అతడికి ఆశించిన ఫలితాన్నివ్వలేదు. నిజానికి ‘శౌర్య’ కంటే ముందు మనోజ్ చేసిన ‘అటాక్’ సినిమా చేశాడు. అది ఎప్పుడో విడుదల కావాల్సింది. దానికున్న కాంబినేషన్ క్రేజ్ దృష్ట్యా అంచనాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. కానీ అనివార్య కారణాలతో వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమాను డిసెంబర్లో విడుదల చేయాలనుకున్నారు. కానీ ‘శౌర్య’ మీద చాలా కాన్ఫిడెన్స్ ఉండటంతో దాన్ని ముందు రిలీజ్ చేసి.. అది విజయవంతమైతే ఆ ఊపులో ‘అటాక్’ రిలీజ్ చేయాలని భావించారు. ఈ సంగతి మనోజే స్వయంగా వెల్లడించాడు.

కానీ ‘శౌర్య’ విషయంలో అంచనాలు తలకిందులయ్యాయి. సినిమా మరీ వీక్ ఏమీ కాకున్నా.. ఓ విభిన్నమైన ప్రయత్నం చేసినా.. జనాలు ఆదరించలేదు. నెగెటివ్ టాక్ వేగంగా స్ప్రెడ్ అయిపోయింది. పైగా పరీక్షల సీజన్ కావడంతో కలెక్షన్లు రాలేదు. మొత్తానికి మనోజ్ కెరీర్లోనే పెద్ద ఫ్లాపుల్లో ఒకటిగా నిలిచిపోయింది ‘శౌర్య’. ఈ సినిమా వల్ల ‘అటాక్’కు కలిసొస్తుందని అనుకుంటే ఇప్పుడు దాని నెగెటివ్ ప్రభావం ఆ మూవీ మీద పడుతోంది. ఏడాది కిందట మంచి క్రేజ్ మధ్య రిలీజవ్వాల్సిన సినిమా ఇప్పుడు.. ఏ అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఐతే అంచనాలు, ఆసక్తి సంగతి పక్కనబెడితే.. మనోజ్, ప్రకాష్ రాజ్, జగపతిబాబు లాంటి విలక్షణ నటుల కాంబినేషన్లో వర్మ రూపొందించిన ఈ సినిమా విడుదలైతే చాలు అన్నట్లుంది జనాల పరిస్థితి. మరి ఈసినిమా ఎప్పుడు థియేటర్లలోకి దిగుతుందో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English