కాజల్‌ని కొనేసిన నిర్మాత

కాజల్‌ని కొనేసిన నిర్మాత

తమిళ నిర్మాత ఉదయనిధి స్టాలిన్‌ హీరో అయిపోయిన సంగతి తెలిసిందే. తొలి సినిమాలో స్టార్‌ హీరోయిన్‌ హన్సిక సరసన నటించి హిట్‌ కొట్టేసిన స్టాలిన్‌ ఇప్పుడు నయనతారతో ఓ చిత్రం చేస్తున్నాడు. హీరోగా తన మీద తనకున్న నమ్మకం కంటే హీరోయిన్ల మీదే ఇతనికి గురి ఎక్కువ అనిపిస్తోంది. అందుకే ఏరి కోరి స్టార్‌ హీరోయిన్లనే తన సినిమాల్లో పెట్టుకుంటున్నాడు. ప్రతి హీరోయిన్‌కీ డబుల్‌ రెమ్యూనరేషన్‌ ఆఫర్‌ చేసి వారు కాదనలేని విధంగా టెంప్ట్‌ చేస్తున్నాడు.

హన్సిక తర్వాత నయనతారతో చేస్తున్న స్టాలిన్‌ తన మూడో సినిమాలో కాజల్‌తో జత కడుతున్నాడు. ఈమధ్య తన పారితోషికం విషయంలో రాజీ పడలేక కొన్ని పెద్ద చిత్రాలని వదిలేసుకున్న కాజల్‌ ఈ యంగ్‌ ప్రొడ్యూసర్‌ కమ్‌ హీరో విసిరిన డబ్బు వలలో పడిపోయింది. స్టాలిన్‌తో నటించడానికి కాజల్‌కి కోటిన్నర వరకు వర్కవుట్‌ అవుతుందనే టాక్‌ ఉంది. హీరోయిన్లని నమ్ముకుని ఎంత కాలం బండి లాగేద్దామని అనుకుంటున్నాడో తెలీదు కానీ వరుసగా స్టార్‌ హీరోయిన్ల డేట్స్‌ సంపాదించేస్తూ కొంతమంది రియల్‌ హీరోలకి కూడా కళ్లు కుట్టేలా చేస్తున్నాడు స్టాలిన్‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English