బచ్చీ, ప్యాంటీ కామెంట్‌కి దిమ్మతిరిగే రిటార్ట్‌

బచ్చీ, ప్యాంటీ కామెంట్‌కి దిమ్మతిరిగే రిటార్ట్‌

ఆలియా భట్‌ బికినీ వేసుకునే ప్యాంటీ వేసుకున్న చిన్న పిల్లలా కనిపిస్తుందని, ఆమెతో ఎందుకని మళ్లీ మళ్లీ బికినీ వేయిస్తారనేది తనకి అర్థం కావడం లేదని బాలీవుడ్‌ క్రిటిక్‌ కమాల్‌ ఆర్‌. ఖాన్‌ కామెంట్‌ చేశాడు. దానికి ఆలియా బాయ్‌ఫ్రెండ్‌ సిద్ధార్థ్‌ మల్హోత్రా అక్కడే ఘాటైన సమాధానమిచ్చాడు. కానీ ఆలియా మాత్రం దానికి స్పందించకుండా సైలెంట్‌గా వుండిపోయింది. కానీ మీడియా ఊరుకోదు కదా. కెఆర్‌కె కామెంట్‌కి స్పందనేంటని ఆలియాని అడిగింది.

కెఆర్‌కె తీరు తెలిసినా కానీ అతడి నుంచి ఎలాంటి ప్రతిస్పందనలు వుంటాయనేది తను ఊహించగలిగినా కానీ ఆలియా వెనక్కి తగ్గలేదు. అతను తన స్థాయి తెలుసుకుని మాట్లాడాలని రిటార్ట్‌ ఇచ్చింది. ఫిలిం క్రిటిక్‌ అయితే సినిమాల గురించి విమర్శించమనండి. ఒక నటి ఫిజిక్‌ గురించి, ఆమె వేసిన బట్టల గురించి మాట్లాడే హక్కు అతనికి లేదు. అతని చీప్‌ బిహేవియర్‌కి ఇది నిదర్శనం. ఇలాంటి వాటిని ఎవరూ సహించకూడదు. సిద్ధార్థ్‌ స్పందించిన తీరు నచ్చింది. అతనే కాదు బాలీవుడ్‌ మొత్తం ఇలాంటి చీప్‌ వ్యక్తులకి గట్టిగా బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందని ఆలియా నిప్పులు కక్కింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు