బంగ్లాదేశ్ ముస్లింలకు షాకిచ్చింది

బంగ్లాదేశ్ ముస్లింలకు షాకిచ్చింది

పొరుగుదేశం బంగ్లాదేశ్ ఇపుడు పెద్ద ఎత్తున వార్తల్లోకి వస్తోంది. పాకిస్తాన్లాగా రెచ్చగొట్టే రాజకీయాలకు, ఉద్రేక పూరిత చర్యలకు క్రికెట్ను వేదికగా చేసుకుంటోందనేది ఇందులో ప్రధానమైన వార్త. ఈ అంశం తెరమీదకు రావడం బంగ్లాదేశ్ పరువును పలుచన చేసిందనే చెప్పుకోవచ్చు. అయితే మరో వార్త ఆ దేశం గొప్పతనాన్ని చాటేవిధంగా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

బంగ్లాదేశ్ అధికారిక మతంగా ఉన్న ఇస్లాంకు ఆ హోదా తొలగించేందుకు ఆ దేశం యోచిస్తున్నది. దేశంలోని ఇతర మతస్థులపై దాడుల నేపథ్యంలో బంగ్లాదేశ్ ఈ నిర్ణయానికి వచ్చింది. దేశంలో ఇస్లాంకు అధికార మతం హోదాను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను ప్రస్తుతం సుప్రీంకోర్టు విచారిస్తోంది. పాకిస్తాన్ నుంచి సొంత దేశంగా ఆవిర్భవిస్తున్న సమయంలోనే బంగ్లాదేశ్ సెక్యులర్ దేశంగా ప్రకటించుకుంది. అయితే దేశంలో పలువురు మత చాందసవాదుల డిమాండ్ల నేపథ్యంలో 1988లో రాజ్యాంగ సవరణ ద్వారా ఇస్లాం దేశంగా మారింది. అయితే తాజాగా తిరిగి లౌకిక దేశంగా మారేందుకు బంగ్లాదేశ్ అడుగులు వేస్తోంది.

డెయిలీమెయిల్ కథనం ప్రకారం దేశంలో ఇస్లాంను జాతీయ మతంగా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను బంగ్లాదేశ్ సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది. దీనికి దేశంలోని మైనారిటీలైన హిందువులు, క్రిస్టియన్లు, షియాముస్లింలు మద్దతు పలుకుతుండటం విశేషం. బంగ్లాదేశ్ జనాభాలో 90 శాతం మంది ముస్లింలు కాగా 8శాతం మంది హిందువులు ఉన్నారు. మిగిలిన వారిలో క్రిస్టియన్లు, ముస్లింమైనారిటీలైన షియాలు ఉన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు