రజనికి యాంటీగా తన కూతురు!

రజనికి యాంటీగా తన కూతురు!

నిజంగానే రజనికాంత్ కూతురు రజనిని ఎదిరిస్తుంది అనుకుంటున్నారా..? ఇది రియల్ లైఫ్ ముచ్చట కాదండీ.. రీల్ లైఫ్ ది. రజనీకాంత్ ప్రస్తుతం దర్శకుడు రంజిత్ తెరకెక్కిస్తున్న 'కబాలి' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో రజనీకాంత్ మాఫియా డాన్ గా నటిస్తున్నాడు. ఆయన భార్యగా రాధికా ఆప్టే కనిపించనుంది. ఈ చిత్రంలో రజనీకి ఓ కూతురు కుడా వుంది. ఈ పాత్ర కోసం ధన్సిక ను ఎంపిక చేశారు.

ఇప్పుడీ పాత్ర సంబధించిన ఓ ఆసక్తికరమైన విషయం బయటికివచ్చింది. ఈ సినిమాలో రజనీకాంత్ ను ఎదిరించే లేడీ డాన్ పాత్రలో ధన్సిక కనిపిస్తుందట. కొన్ని కారణాల వలన తండ్రితో విభేదించి మరో ముఠాను ఏర్పాటు చేసుకుని.. తండ్రికే ఎదురుతిరుగుతుందట. 'తండ్రి నుండి విడిపోయి సెపరేట్ ముఠా పెట్టుకున్న కూతురు'.. ఈ పాయింట్ ఏదో కాస్త ఆసక్తికరంగానే వుంది. మరి సినిమాలో ఇలాంటి ఇంటరెస్టింగ్ పాయింట్స్ ఎన్ని ఉన్నాయో..! రజనీ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ సినిమా వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు