అందరూ వదిలేసినా.. మహేష్ గౌరవించాడు

అందరూ వదిలేసినా.. మహేష్ గౌరవించాడు

నాలుగు దశాబ్దాల నుంచి టాలీవుడ్లో రచయితలుగా కొనసాగుతున్నారు పరుచూరి బ్రదర్స్. అందులో మూడు దశాబ్దాలు స్వర్ణయుగమే. స్టార్ రైటర్లుగా ఓ వెలుగు వెలిగారు. ముందు ఎన్టీఆర్తో.. ఆ తర్వాత నందమూరి బాలకృష్ణతో బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టారు ఈ అన్నదమ్ములు. కానీ 'పలనాటి బ్రహ్మనాయుడు' దగ్గర్నుంచి వాళ్ల రాత మారిపోయింది. వరుస ఫ్లాపులతో సతమతమయ్యారు. వాళ్ల మీద ఇండస్ట్రీకి ఉన్న నమ్మకం క్రమక్రమంగా తగ్గుతూ వచ్చింది. ఐదారేళ్ల నుంచి పరుచూరి సోదరుల్ని పట్టించుకునేవారే కరవయ్యారు. వాళ్లిద్దరూ కూడా ఇన్నేళ్లకు విశ్రాంతి దొరికిందని ప్రశాంతంగా గడుపుతున్నారు.

మధ్యలో గుణశేఖర్, కృష్ణవంశీ లాంటి దర్శకులు ఈ దిగ్గజ రచయితల సాయం తీసుకుంటున్నారు కానీ.. మిగతా వాళ్లు పెద్దగా పట్టించుకోవట్లేదు. ఇలాంటి టైంలో మహేష్ బాబు లాంటి స్టార్ హీరో పరుచూరి సోదరులపై నమ్మకముంచి.. వారితో పని చేయించుకోవడం ఆసక్తి రేపుతోంది. 'బ్రహ్మోత్సవం' సినిమాలో ఈ సీనియర్ రచయితల హ్యాండ్ పడ్డట్లు సమాచారం. డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల పూర్తి స్థాయి స్క్రిప్టు తయారు చేసుకోకుండానే షూటింగ్ కు వెళ్లిపోయాడట. ఇందులో హీరోయిజం కూడా అనుకున్న స్థాయిలో లేదని ఫీలైన మహేష్.. పరుచూరి సోదరుల్ని ఆశ్రయించాడట. ఫ్యామిలీ ఎమోషన్లతో పాటు హీరోయిజం పండించడంలో పరుచూరి సోదరులది అందెవేసిన చేయి. అందుకే వారితో స్క్రిప్టుకు మెరుగులు దిద్దించాడట మహేష్. సీనియర్ రచయితల్ని ఇలా గౌరవించిన మహేష్కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు