ప్రభాస్ చేస్తే ఆ లుక్కే వేరంటున్నాడు

ప్రభాస్ చేస్తే ఆ లుక్కే వేరంటున్నాడు

ప్రస్తుతం ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పొజిషనేంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నేషనల్ లెవెల్లో స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న ప్రభాస్ మీద ఎంత బడ్జెట్ అయినా పెట్టి సినిమా తీయడానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. టాలీవుడ్లోనే కాక.. బాలీవుడ్లో సైతం పెద్ద పెద్ద డైరెక్టర్లు అతడితో సినిPrabhas, Krishnam Raju, Baktha kanappaసక్తి లేకపోయినప్పటికీ.. కృష్ణంరాజు మాత్రం పదే పదే ఈ ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నాడు. ముఖ్యంగా 'భక్తకన్నప్ప' రీమేక్ విషయంలో మాత్రం తగ్గేదే లేదంటున్నాడు. ఈ సినిమాలో నటించడానికి ప్రభాస్కు సైతం చాలా ఆసక్తి ఉందని ఆయనంటున్నాడు. ''కన్నప్ప పాత్ర చేయాలని మా ప్రభాస్కు చాలా ఆసక్తి. కొన్నాళ్ల క్రితం దానిపై పని చేశాం కూడా. బడ్జెట్ ఎక్కువవుతుందని ఆగాం. ఇప్పుడు 'బాహుబలి' విజయంతో మాకా భయం లేదు. ఆ సినిమాలో శివలింగాన్ని భుజానికెత్తుకొని ప్రభాస్ వస్తుంటే.. విదేశాల్లోనూ జై కొట్టారు. అదీ శివుడి గొప్పతనం. రేపు ప్రభాస్తో తీసే 'భక్త కన్నప్ప' కూడా ఆ స్థాయిలో తీయాలని మా ప్లాన్. వేరే వాళ్లు కూడా కన్నప్ప కథతో సినిమా తీస్తారని వార్తలు వస్తు న్నాయి. కానీ, ఎవరెన్ని చేసినా నా స్క్రిప్టులో మా వాడు చేస్తే దాని లుక్కే వేరు'' అన్నారు కృష్ణంరాజు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు