భారత్-పాక్ బోర్డర్ లో భజరంగీ భాయిజాన్

భారత్-పాక్ బోర్డర్ లో భజరంగీ భాయిజాన్

బాలీవుడ్ సినిమా భజరంగీ భాయ్జాన్ను తలపించే సన్నివేశం ఒకటి శనివారం భారత్- పాక్ సరిహద్దుల్లో జరిగింది. దేశ సరిహద్దులు దాటిన ఓ మూగ, చెవిటి పాకిస్థానీ చిన్నారిని మ బీఎస్ఎఫ్ దళాలు ఆ దేశ అధికారులకు అప్పగించారు.

మాటలు రాని, వినికిడి శక్తి లేని ఓ ఐదు సంవత్సరాల పాకిస్తాన్ బాలిక పంజాబ్ అబోహార్ సెక్టార్ ప్రాంతంలోని సరిహద్దు నుంచి భారత్లోకి పొరపాటున ప్రవేశించింది. శనివారం ఉదయం 10.30 గంటల సమయంలో అంతర్జాతీయ సరిహద్దులు దాటిన చిన్నారిని గుర్తించిన బీఎస్ఎఫ్ దళానికి చెందిన నతాసింగ్ వాలా ఆ చిన్నారిని ప్రశ్నించడంతో చెవిటి, మూగ అని తెలి సింది. బాలిక పేరు, ఆమెకు సంబంధించి వివరాలేమీ తెలియరాలేదు. సరిహద్దు దాటి వచ్చిందన్న హెచ్చరికలతో చిన్నారిని పట్టుకున్న భద్రతా దళాలు.. చిన్నారి పరిస్థితిని గమనించి మానవతా దృక్పథంతో పాకిస్తాన్ రేంజర్స్ను సంప్రదించి ఆ బాలికను ఆ దేశ అధికారులకు అప్పగించారు.

అమాయకపు చూపులతో బిత్తరపోయిన ఆ చిన్నారి తల్లిదండ్రులెవరో కనుక్కుని వారికి అప్పగించేందుకు పాకిస్థాన్ అధికారులు ఇప్పటికే ఆ ప్రాంతంలో విచారణ ప్రారంభించారు. కాగా నిత్యం అట్టుడికే సరిహద్దుల్లో శనివారం ఆ చిన్నారి చేసిన పొరపాటు ఇరుదేశాల మధ్య పరిస్థితులతో సంబంధం లేకుండా మానవతకు పెద్దపీట వేసేలా చేసింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు