నయన బొమ్మ చూపించి అమ్మేస్తున్నారు..

నయన బొమ్మ చూపించి అమ్మేస్తున్నారు..

నయనతార.. ఈ పేరుకు సౌత్ ఇండస్ట్రీలో ఉన్న గిరాకీ మామూలుగా లేదు. అమ్మడు ఇప్పుడు గోల్డెన్ లెగ్ అయిపోయింది. ఏ సినిమాలో అడుగు పెడితే అది సూపర్ హిట్. ముఖ్యంగా తమిళ ఇండస్ట్రీలో అయితే నయన బొమ్మ కనిపిస్తే చాలు నిర్మాతలు ఎగబడిపోతున్నారు. స్టార్ హీరోలు సినిమాలో ఉన్నా.. నయనతార ఇమేజ్ తోనే బొమ్మలు సూపర్ హిట్ అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో వచ్చిన మాయ, తని ఒరువన్, నానుం రౌడీథాన్ సినిమాలు సూపర్ హిట్టయ్యాయి.

మాయ ఆల్రెడీ తెలుగులో వచ్చింది. ఈ మధ్యే నానుం రౌడీథాన్ ను కూడా నయనతార బొమ్మ చూపించి నేనూ రౌడీనే అంటూ డబ్ చేసారు. ఇది వచ్చి వెళ్లిన సంగతి కూడా జనాలకు తెలియదు. విజయ్ సేతుపతి, నయనతార జంటగా విఘ్నేష్ శివన్ తెరకెక్కించిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. తెలుగులో విజయ్ సేతుపతికి అస్సలు మార్కెట్ లేదు. ఆ మాటకొస్తే.. తెలుగులో విజయ్ సేతుపతి అంటే ఎవరో కూడా తెలియదు. కేవలం నయన బొమ్మ చూపించి తెలుగులో ఈ సినిమాను అమ్మేశారు.

ఇక ఇప్పుడు మరో సినిమాను కూడా ఇలాగే అమ్మేస్తున్నారు. తమిళనాట ఉదయనిధి స్టాలిన్ హీరోగా తెరకెక్కిన నాన్ బెండా సినిమాను తెలుగులో గుడ్ ఈవెనింగ్ గా డబ్ చేస్తున్నారు. గతంలో వీళ్లు కలిసి నటించిన ఇదు కతర్వేలన్ కాదల్ కూడా తెలుగులో శీనుగాడి లవ్ స్టోరీగా వచ్చి వెళ్లిపోయింది. అప్పుడు నయనతార ఇమేజ్ చూసి సినిమాను కొన్నారు. ఇప్పుడు కూడా ఇదే జరుగుతోంది. కేవలం నయన్ పోస్టర్ చూపించి స్టాలిన్ సినిమాను అమ్మేస్తున్నారు దర్శకనిర్మాతలు. మరి నయన చెప్పే గుడ్ ఈవెనింగ్ ఎలా ఉండబోతుందో చూడాలిక.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు