మోహన్ బాబు పేరు వాడనంటున్నాడు

మోహన్ బాబు పేరు వాడనంటున్నాడు

తండ్రి పేరు చెప్పుకుని తాను ఎదగాలని కోరుకోవట్లేదని అంటున్నాడు మంచు మనోజ్. తాను హీరోగా పరిచయం కావడానికి.. నిలదొక్కుకోవడానికి తన తండ్రి మోహన్ బాబే కారణమని.. ఐతే తన సినిమాల విషయంలో మాత్రం పూర్తిగా తనదే నిర్ణయమని, తన తండ్రి ప్రమేయం ఏమీ ఉండదని అతనన్నాడు. ''కెరీర్ ఆరంభం నుంచి నా సినిమాలకు సంబంధించి అన్నీ నేనే చూసుకుంటా. నాకు సరిపోయే స్క్రిప్టులు ఎంచుకోవడం.. నా సినిమాలకు సంబంధించి రిస్క్ తీసుకోవడం అన్నీ నేనే చేస్తా. అందుకే ఎక్కువగా కొత్త దర్శకులతో పని చేశాను. మా నాన్న నీడలో ఉండాలని నేను కోరుకోవట్లేదు. నాకంటూ ఇండస్ట్రీలో ఓ పేరు తెచ్చుకోవాలన్నది నా లక్ష్యం'' అని మనోజ్ చెప్పాడు.

తన కొత్త సినిమా 'శౌర్య' రిజల్ట్ గురించి తనకే టెన్షన్ లేదని.. ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని మనోజ్ కాన్ఫిడెంట్గా చెప్పాడు. ''మామూలుగా ఈ సినిమాకే కాదు.. నా సినిమాలు వేటికీ రిలీజ్ ముందు టెన్షన్ పడను. మనం చేయాల్సింది చేసేశాం కాబట్టి ఇక రిజల్ట్ గురించి అప్పుడు టెన్షన్ పడి లాభం లేదు. ఇక శౌర్య విషయంలో నాకు చాలా చాలా కాన్ఫిడెన్స్ ఉంది. నా కెరీర్లో చాలా వైవిధ్యమైన సినిమా శౌర్య'' అని చెప్పాడు మనోజ్. ఈ సినిమా కోసం లుక్ మార్చేయడం గురించి మాట్లాడుతూ.. ''అది ముందే అనుకుని చేసింది కాదు. దశరథ్ కథ చెప్పాక.. లుక్ మార్చుకుంటే బాగుంటుందనిపించింది. అతను ఓ స్టన్నింగ్ స్క్రిప్టు చెప్పాడు. దీంతో జనాల్ని నేను కూడా ఓ సర్ప్రైజ్ లుక్తో పలకరిద్దామనుకున్నా'' అని మనోజ్ అన్నాడు.

Read Also:

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English