క్యాస్ట్ ఫీలింగ్ గురించి మాట్లాడుతున్న మనోజ్..

క్యాస్ట్ ఫీలింగ్ గురించి మాట్లాడుతున్న మనోజ్..

ఇండస్ట్రీలో మరోసారి కులాల టాపిక్ వచ్చింది. మనదంతా సినిమా కులం.. మనకు కులాలతో పనిలేదంటూనే ఎవరో ఒకరు ఏదో టైమ్ లో కులాల టాపిక్ తీస్తూనే ఉంటారు. ఇప్పుడు కూడా మరోసారి కులం టాపిక్ అలాగే వచ్చింది. ఈ సారి కులాల గురించి ప్రస్తావించింది మంచు వారబ్బాయి మనోజ్. ఈ కుర్ర హీరో టైమ్ వచ్చిన ప్రతీసారి కులాల టాపిక్ తీసుకొస్తాడు. తాజాగా శౌర్య ప్రమోషన్ లో భాగంగా జరిగిన ప్రెస్ మీట్ లోనూ కులాల గురించి మాట్లాడాడు...మనోజ్.

అన్ని కులాల వాళ్లు కలిసి పని చేస్తేనే ఓ సినిమా వస్తుందని.. తన సినిమా కోసం ఏ కులం వాళ్లు పని చేస్తున్నారో కూడా తెలియదని.. అందరూ కలిసినప్పుడే ఫలితం వస్తుందని.. కులాల గురించి మాట్లాడితే ఏ పని జరగదని చెబుతున్నాడు మనోజ్. గతంలో శౌర్య ఆడియో ఫంక్షన్ లోనూ కులాల గురించి టాపిక్ తీసుకొచ్చాడు ఈ హీరో. తనకు క్యాస్ట్ ఫీలింగ్ లేదని.. కానీ ఇండస్ట్రీలో కొందరు కావాలనే కులాల గురించి మాట్లాడుతున్నా రని చెబుతున్నాడు ఈ హీరో. గత తరం హీరోలు కులాల గురించి మాట్లాడుకున్నా పర్లేదు గానీ ఈ తరం హీరోలైనా కులాల గురించి మరిచిపోవాలని హితవు పలుకుతున్నాడు మనోజ్. కులాల్ని దృష్టిలో ఉంచుకొని సినిమాలు చూడొద్దని కోరుతున్నాడీ హీరో.

మొత్తానికి క్యాస్ట్ ఫీలింగ్ పై మనసులో మాట బయటపెట్టినందుకు మనోజ్ పై కొందరు ప్రశంసలు పంచుతుంటే.. మరికొందరు మాత్రం అనవసరంగా కులాల టాపిక్ తీసుకొస్తున్నాడంటూ మనోజ్ పై విమర్శలు గుప్పిస్తున్నారు.

Also Read:

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English