నాగ్ అనుకున్నాడు.. వంశీ డీవీడీ ఇచ్చాడు

నాగ్ అనుకున్నాడు.. వంశీ డీవీడీ ఇచ్చాడు

వెతకబోయిన తీగ కాలికి తగలడం అంటే ఇదే అంటున్నాడు అక్కినేని నాగార్జున. తాను కొన్నేళ్ల కిందటే ఫ్రెంచ్ మూవీ 'ది అన్టచబుల్స్' చూశానని.. తనతో పాటు అమలకు కూడా ఆ సినిమా చాలా బాగా నచ్చిందని.. ఈ సినిమాను ఎవరైనా తెలుగులో తీస్తే బాగుంటుందని అనుకున్నానని.. ఐతే ఆ తర్వాత కొంత కాలానికి డైరెక్టర్ వంశీ పైడిపల్లి 'ది అన్ టచబుల్స్' డీవీడీ ఇచ్చి చూడమన్నాడని.. అప్పటికప్పుడు ఆ సినిమా ఒప్పేసుకున్నానని చెప్పాడు నాగ్. ఇలా అనుకోని కోఇన్సిడెన్స్తో ఈ సినిమా మొదలైందని.. తాను అనుకున్నదాని కంటే వంశీ అద్భుతంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడని నాగ్ చెప్పాడు.

'ఊపిరి' ఆడియో వేడుకలో నాగ్ మాట్లాడుతూ.. ''అభిమానులందరూ నా ఊపిరి. ఈ సినిమాకు ఊపిరి పీవీపీ సంస్థ. నాకు 'ఊపిరి' సినిమా పెద్ద జర్నీ అయిపోయింది. ఈ సినిమా ఓరిజినల్ నాకు, అమలకి బాగా నచ్చింది . తెలుగులో ఎవరైనా చేస్తే బాగుంటుంది అనుకుంటుంటే.. వంశీనే వచ్చి నాకు ఆఫర్ ఇచ్చాడు. నాది వీల్ ఛైర్లో కూర్చొనే పాత్ర అని అభిమానులు బాధపడొద్దు. ఆ క్యారెక్టర్ మనసు పరుగులు పెడుతూనే ఉంటుంది. నవ్విస్తాం. ఏడిపిస్తాం. ప్యారిస్ చూపిస్తాం. ప్రపంచం చూపిస్తాం. మనిషికి ఒక తోడు ఎంత అవసరం అనేదే ఊపిరి సారాంశం. తోడు అంటే ఒంటరితనం అనేదే ఉండదు. ఈ సినిమాతో కార్తి రూపంలో నాకో తమ్ముడు దొరికాడు. ఊపిరి ఖచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుంది" అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు