బాలయ్యా.. ఇది మాత్రం రిస్క్ కాదా?

బాలయ్యా.. ఇది మాత్రం రిస్క్ కాదా?

ముందు బోయపాటి శ్రీను అన్నారు.. తర్వాత సింగీతం శ్రీనివాసరావు తెరమీదికి వచ్చారు.. ఆపై అనిల్ రావిపూడి పేరు హల్ చల్ చేసింది.. అంతలోనే క్రిష్ లైన్లోకి వచ్చాడు.. ఇప్పుడిక లేటెస్టుగా కృష్ణవంశీ పేరు వినిపిస్తోంది. మొత్తానికి బాలయ్య వందో సినిమా విషయంలో ఉన్న కన్ఫ్యూజన్ అంతా ఇంతా కాదు. లేపాక్షి ఉత్సవాల సందడి కూడా ముగిసిపోయిన నేపథ్యంలో ఇక బాలయ్య వందో సినిమా కబురు వినిపించేస్తాడనే అంతా ఎదురు చూస్తున్నారు.

ఐతే బాలయ్య మాట్లాడకముందే ఈ రోజు వందో సినిమాకు సంబంధించి రెండు అప్ డేట్స్ బయటికి వచ్చాయి. ఈ సినిమా కంటే ముందు కృష్ణవంశీ తీయాలనుకున్న 'రుద్రాక్ష' ఆగిపోయిందన్నది ఒక అప్ డేట్ అయితే.. బాలయ్య వందో సినిమా కోసం కృష్ణవంశీ.. నారా రోహిత్, తారకరత్నలకు అతిథి పాత్రలు డిజైన్ చేశాడన్నది ఇంకో అప్ డేట్.

దీన్ని బట్టి బాలయ్య వందో సినిమా కృష్ణవంశీ దర్శకత్వంలోనే ఉండబోతోందన్నది దాదాపుగా ఖాయమైపోయింది. ఐతే తన కోసం చాలామంది లైన్లో ఉండగా.. బాలయ్య కృష్ణవంశీనే ఎందుకు ఎంచుకున్నాడన్నదే అర్థం కాని విషయం. మామూలుగా బాలయ్య శైలికి, కృష్ణవంశీ స్టయిల్కి అస్సలు మ్యాచ్ అవ్వదు. వాళ్లిద్దరి సినిమాల్ని పోల్చి చూస్తే ఆ విషయం స్పష్టంగా తెలిసిపోతుంది. ఇంతకుముందు కృష్ణవంశీ అసలు స్టార్లను లెక్క చేసేవాడు కాదసలు.

తన కథలకు నప్పేవాళ్లను హీరోలుగా ఎంచుకునేవాడు. ఎక్కువగా మీడియం, చిన్న రేంజి హీరోలతోనే సినిమాలు చేసేవాడు. కానీ గత కొన్నేళ్లలో ఆయన సినిమాలు దారుణమైన ఫలితాలు చవిచూశాయి. దీంతో తన స్టయిల్ పక్కనబెట్టేసి సేఫ్ గేమ్ ఆడటానికి ప్రయత్నిస్తున్నాడు. 'గోవిందుడు అందరివాడేలే' ఆ కోవలోని సినిమానే. ఐతే అందులో కృష్ణవంశీ ముద్ర కనిపించకపోవడం ఆయన అభిమానుల్ని సైతం నిరాశ పరిచింది.

ఇలాంటి ఫామ్లో ఉన్న.. పైగా తన శైలికి నప్పని దర్శకుడితో బాలయ్య వందో సినిమా చేయాలనుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. సింగీతం శ్రీనివాసరావుతో సినిమా చేయడం రిస్క్ అన్న ఉద్దేశంతోనే 'ఆదిత్య 999' పక్కనబెట్టినట్లు చెబుతున్నారు. మరి కృష్ణవంశీతో సినిమా అన్నా కూడా రిస్కే అనడంలో సందేహమేమీ లేదు. మరి బాలయ్య ఉద్దేశం ఏంటో మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు