రిలీజ్ సరే... హిట్లెన్ని.. ఫట్లెన్ని..?

రిలీజ్ సరే... హిట్లెన్ని.. ఫట్లెన్ని..?

ఒకేరోజు మూకుమ్మడిగా సినిమాలు విడుదల కావడం అనేది చాలా అరుదు. ఈ విచిత్రం ఈ వారం జరిగింది. ఎప్పట్నుంచో బాక్సుల్లో మగ్గిపోతున్న సినిమాలన్నీ ఒకేసారి బయటికి తీసుకొచ్చారు దర్శకనిర్మాతలు. వీటిలో సగానికి పైగా సినిమాల్లో పరిచయం లేని హీరోలు కూడా ఉన్నారు. మరి ఈ వారం విడుదలైన సినిమాల్లో దేనికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది... ఏది నిరాశ పరిచిందో ఓ లుక్కేద్దాం.

ఈ వారం విడుదలైన సినిమాల్లో కొద్దోగొప్పో పాజిటివ్ బజ్ తో వచ్చిన సినిమా క్షణం. అడవిశేష్, అనసూయ ప్రధానపాత్రల్లో రవికాంత్ తెరకెక్కించిన ఈ చిత్రం సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందింది. పివిపి ఈ చిత్రాన్ని నిర్మించాడు. అంచనాల్లేకుండా వెళ్లిన వాళ్లకు క్షణం బాగా నచ్చుతుంది. ముఖ్యంగా స్క్రీన్ ప్లే బేస్డ్ కథలు కనుమరుగవుతున్న ఈ రోజుల్లో క్షణం లాంటి సినిమాలు రావడం ఇండస్ట్రీకి కూడా మంచిది. పాజిటివ్ టాక్ తో ఈ వారం క్షణం బాగానే వసూళ్లు పిండుకునే ఛాన్స్ ఉంది. ఇక ఇదే రోజు వచ్చిన పడేసావే, రాజుగారింట్లో 7వ రోజు, వీరివీరి గుమ్మడి పండు, ఎలుకా మజాకా.. సినిమాల్లో దేనికీ సరైన రెస్పాన్స్ రాలేదు.
 
శ్రీకాంత్ టెర్రర్ కూడా ఇదే వారం విడుదలైంది. చాలా రోజుల తర్వాత ఈ సీనియర్ హీరో సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వినిపిస్తోంది. అయితే సరైన పబ్లిసిటీ లేకపోవడంతో టెర్రర్ వైపు ప్రేక్షకులు అడుగేయట్లేదు. ఇక ఈ వారం విడుదలైన డబ్బింగ్ సినిమాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. జాంబీ జోనర్ అంటూ సందడి చేస్తూ వచ్చిన యమపాశంకు తెలుగులో అనుకున్నంత టాక్ రాలేదు. తొలిరోజు నుంచే ఈ సినిమా సోసో టాక్ తోనే ఆరంభమైంది. తెలుగు ప్రేక్షకుల్ని అలరించడంలో జయంరవి అండ్ కో మిస్ ఫైర్ అయ్యారు. ఇక గాడ్స్ ఆఫ్ ఈజిప్ట్ హాలీవుడ్ సినిమాలు చూసేవాళ్లకు ఓకే అనిపిస్తుంది. మొత్తానికి ఈ వారం క్షణం, టెర్రర్ మాత్రమే పాజిటివ్ టాక్ తో బయపడ్డాయి.

ఏది ఏమైనా.. ఓవరాల్ గా తెలుగు ప్రేక్షకుల్ని అంతగా మెప్పించని వారంగా మిగిలింది. క్షణం, టెర్రర్ కూడా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే చిత్రం కాకపోవడమే దీనికి కారణం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు