స్మృతి ఇరానీని ఇరుకునపెట్టిన సొంత పార్టీ ఎంపీ

స్మృతి ఇరానీని ఇరుకునపెట్టిన సొంత పార్టీ ఎంపీ

 జవహర్లాల్ నెహ్రూ వర్సిటీలో మహిషాసురుడిని కీర్తించారనీ, దుర్గామాతను సెక్స్ వర్కర్ గా అభివర్ణించారనీ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ చేసిన విమర్శలసై మరో బీజేపీ ఎంపీ స్పందన మంత్రిని ఇబ్బందుల్లో పడేసింది. స్మృతి వ్యాఖ్యలపై ఇప్పటికే పార్లమెంటులో గొడవ జరుగుతుండగా సాటి బీజేపీ ఎంపీయే మహిషాసుర ఉత్సవానికి మద్దతుగా మాట్లాడడం ఇప్పుడు బీజేపీని ఇరుకున పెట్టింది.

 జెఎన్ యూలో జరిగిన మహిసారుల ఫెస్టివల్ కు తానూ హాజరయ్యానని ఢిల్లీ ఎంపీ ఉదిత్ రాజ్ చెప్పారు. అయితే తాను ఈ ఫెస్టివల్ కు 2013లో హాజరయ్యాననీ, జెఎన్ యూలో మహిషాసురుడిని పూజిస్తూ పండుగ చేయడం 2011 నుంచి జరగుతోందనీ వెల్లడించాడు. తాను ఆ కార్యక్రమానికి ఇష్టపూర్తిగానే హాజరయ్యానని ఉదిత్ రాజ్ స్పష్టం చేశారు. కాలంతో పాటు తానూ మారానని పేర్కొన్నారు. కుల వివక్ష కూడదని తాను నమ్మను కనుకనే ఆ కార్యక్రమంలో పాల్గొన్నానని పేర్కొన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు