రానా సినిమాకు ఇన్ని కోట్లా?

రానా సినిమాకు ఇన్ని కోట్లా?

బాహుబలి సినిమా తర్వాత రానా దగ్గుబాటి రేంజి ఎంత పెరిగిందో చూపించేలా ఉంది అతడి కొత్త సినిమా 'గాజి". ఇంతకుముందు రానా సోలో హీరోగా నటించే సినిమాలకు రూ.10 కోట్ల బడ్జెట్ పెట్టడం కూడా కష్టంగా ఉండేది. కానీ 'గాజి" మీద ఏకంగా రూ.70 కోట్లకు పైగా బడ్జెట్ పెడుతోందట పీవీపీ సంస్థ. ఈ సినిమా కోసం హైదరాబాద్లో ఏకంగా సబ్ మెరైన్ సెట్టింగే వేసేయడం విశేషం. సబ్ మెరైన్ ఎంత పెద్దగా ఉంటుందో.. నిజమైన సబ్ మెరైన్ను తలపించేలా సెట్టింగ్ వేయడం ఎంత కష్టమో చెప్పాల్సిన పని లేదు. దీని కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిందే. ఐతే పీవీపీ సంస్థ దానికేమీ వెనకబాడట్లేదు.

హైదరాబాద్లో అద్భుతమైన సబ్ మెరైన్ సెట్టింగ్ వేసి.. సముద్ర గర్భంలో ఉన్న ఫీలింగ్ తెప్పిస్తూ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారట. ఈ సన్నివేశాలకు సంబంధించిన విశేషాలేమీ బయటకు పొక్కకుండా టైట్ సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేశారట. ఇండియాలో రాబోతున్న తొలి సబ్ మెరైన్ బేస్డ్ మూవీ 'గాజి"నే కావడం విశేషం. 1971లో కనిపించకుండా పోయిన పాకిస్థాన్ సబ్ మెరైన్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. సంకల్ప్ రెడ్డి అనే యంగ్ డైరెక్టర్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. అతనే రాసిన 'బ్లూ ఫిష్" అనే పుస్తకం ఆధారంగా సినిమా రూపొందిస్తున్నాడు. రానా నేవీ అధికారి పాత్ర పోషిస్తుండగా.. తాప్సి పన్ను శరణార్థిగా కనిపించబోతోంది. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు