అతనికి దొరక్కుండా బన్నీ పరార్‌!

అతనికి దొరక్కుండా బన్నీ పరార్‌!

తమిళ దర్శకుడు లింగుస్వామికి తెలుగులో ఎవరైనా పెద్ద హీరోతో సినిమా చేయాలని చాలా కాలంగా కోరిక అలాగే మిగిలిపోయింది. మహేష్‌ చుట్టూ తిరిగి, పవన్‌కళ్యాణ్‌ కోసం పడిగాపులు పడి, చరణ్‌ని ఇంప్రెస్‌ చేయడానికి ట్రై చేసి చాలా టైమ్‌ వేస్ట్‌ చేసుకున్నాడు. కమర్షియల్‌ సినిమాలు తీయడంలో లింగుస్వామికి వున్న కమాండ్‌ వల్ల అతనితో పని చేయడానికి అల్లు అర్జున్‌ అంగీకరించాడు. దీంతో తెలుగునాట మార్కెట్‌ పెంచుకోవచ్చునని లింగుస్వామి అతని కోసం ఎదురు చూస్తున్నాడు. కమిట్‌మెంట్‌ ప్రకారం లింగుస్వామితో బన్నీ తన తదుపరి చిత్రం చేయాల్సి వుంది.

అతను ఖాళీ అయ్యేలోగా తాను మరో సినిమాతో బిజీగా వుండరాదని లింగుస్వామి 'పందెంకోడి 2' కూడా వదిలేసుకున్నాడు. సూర్యతో 'సికిందర్‌' తీసిన లింగుస్వామిపై ఒక్కసారిగా క్రేజ్‌ తగ్గింది. కానీ తన కోసం లింగుస్వామి వెయిట్‌ చేస్తూ వుండడంతో, అతడిని తప్పించుకోవడానికి బన్నీ చాలా తంటాలు పడుతున్నాడట. సరైనోడు తర్వాత వెంటనే మరో మాస్‌ సినిమా చేయడం కరెక్ట్‌ కాదు కాబట్టి లింగుస్వామి ప్రాజెక్ట్‌ వాయిదా వేయాలని చూస్తున్నాడట. కానీ ఇప్పుడు బన్నీకి వున్న వేరే కమిట్‌మెంట్స్‌ ఏమీ లేవు. అందుకే అర్జంటుగా ఏదో ఒక సినిమా అనౌన్స్‌ చేయించాలని చూస్తున్నాడు కానీ ప్రస్తుతానికి అతనితో ఇమ్మీడియట్‌గా చేయడానికి నమ్మదగ్గ దర్శకులు దొరకడం లేదు. అదటండీ సంగతి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు