వరుణ్ హీరోయిన్ కు హాలీవుడ్ ఛాన్స్..!

వరుణ్ హీరోయిన్ కు హాలీవుడ్ ఛాన్స్..!

వరుణ్ తేజ్ హీరోగా పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన సినిమా 'లోఫర్'. ఈ సినిమా ద్వారా దిశా పటాని హీరోయిన్ గా పరిచయమయ్యింది. ఈ సినిమా తరువాత బాలీవుడ్ లో నీరజ్ పాండే దర్శకత్వంలో మరో సినిమాలో నటించింది. చేసింది.. రెండు సినిమాలైనా.. ఏకంగా హాలీవుడ్ లో నటించే ఛాన్స్ కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ.

జాకీ చాన్ హీరోగా నటిస్తోన్న 'కుంగ్ ఫూ యోగా' సినిమాలో దిశా కీలకపాత్రలో నటించనుందని తెలుస్తోంది. స్టాన్లీ టాంగ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. యోగా, మార్షల్ ఆర్ట్స్ లో నిష్ణాతురాలైన ఆర్కియాలజీ ప్రొఫెసర్ పాత్రలో ఆమె కనిపించనుందని సమాచారం. ఈ పాత్ర కోసం దిశా పటాని ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకోనుందట. మూడో సినిమాకే హాలీవుడ్ ఛాన్స్ రావడంతో ఈ అమ్మడు తెగ సంబరపడిపోతుందట. మరి ఇక తెలుగులో దిశా నటిస్తుందో లేదో..చూడాలి..!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు