జేమ్స్ బాండ్ కారు.. రూ. 24 కోట్లే

జేమ్స్ బాండ్ కారు.. రూ. 24 కోట్లే

ఒకప్పుడు జేమ్స్ బాండ్ సినిమా అంటే చాలు.. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఉత్సాహంతో ఊగిపోయేవాళ్లు. ఆ క్యారెక్టర్ అంటే పడి చచ్చేవాళ్లు. బాండ్ సినిమాల్ని వేలం వెర్రిగా చూసేవాళ్లు. కానీ ఇప్పుడంత ఆసక్తి కనిపించట్లేదు. రాను రాను బాండ్ సినిమాలకున్న వాల్యూ తగ్గిపోతోంది. వసూళ్లు కూడా ఆశించిన స్థాయిలో ఉండట్లేదు. ప్రస్తుత జేమ్స్ బాండ్ డేనియల్ క్రెయిగ్ సైతం మళ్లీ బాండ్గా కనిపించడానికి ఆసక్తి చూపించట్లేదు. బాండ్ సినిమాలు తీసే నిర్మాణ సంస్థ కూడా తర్వాతి సినిమాపై తర్జన భర్జన పడుతోంది. మరోవైపు బాండ్ వాడే వాహనాలు, వస్తువుల వేలం విషయంలోనూ జనాల్లో ఆసక్తి తగ్గిపోతున్న విషయం కూడా ఆశ్చర్యం కలిగిస్తోంది.

బాండ్ సిరీస్లో భాగంగా 1964లో వచ్చిన 'గోల్డెన్ ఫింగర్", 1965లో వచ్చిన 'థండర్బాల్" సినిమాల్లో బాండ్ ఉపయోగించిన డీబీ 5 కార్లను తర్వాతి కాలంలో వేలం వేయగా.. ఒక్కోటి ఏకంగా 31 కోట్ల రూపాయలకు అమ్ముడుబోయాయి. ఐతే ఇటీవలే 'స్పెక్టర్" సినిమాలో బాండ్ వాడిన రెండు కార్లను వేలం వేయగా.. ఒక్కోటి రూ.24 కోట్లు మాత్రమే పలికాయి. నిజానికి ఈ కారు తయారీకే ఆ మొత్తం ఖర్చయిందట. కనీసం తయారీ ధర మీద ఎంతో కొంత మొత్తం ఎక్కువ పలక్కపోగా.. అదే ధరకు వేలంలో దక్కించుకోవడం విడ్డూరమే. జేమ్స్ బాండ్ సినిమాలపై జనాలకు ఆసక్తి తగ్గిపోతోంది అనడానికి ఇదే నిదర్శనం అంటున్నారు జనాలు. కాబట్టి మున్ముందు బాండ్ సినిమాలు రావడం డౌటేనేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు