నాగ్ చెబుతున్న 300 కోట్ల లెక్క

నాగ్ చెబుతున్న 300 కోట్ల లెక్క

కేవలం 400 థియేటర్లలో విడుదలైంది ‘సోగ్గాడే చిన్నినాయనా’. పైగా ఇంకో మూడు సినిమాలతో పోటీ. అయినా నాలుగు వారాల్లోనే రూ.50 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది నాగార్జున సినిమా. నాగ్ కెరీర్లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమా ఇదే. ఐతే కలెక్షన్ల లెక్కల గురించి నాగ్ దగ్గర ప్రస్తావిస్తే లైట్ తీసుకుంటున్నాడు. అదేమంత పెద్ద విషయం కాదంటున్నాడు.

‘‘ఇప్పటి సినిమాల కలెక్షన్ల గురించి గొప్పగా చెప్పుకుంటున్నాం కానీ... మాయాబజార్‌, అడవిరాముడు, ప్రేమాభిషేకం లాంటి సినిమాల కలెక్షన్లు ఇప్పటి లెక్కల ప్రకారం రూ.300 కోట్లకు సమానం అనుకోవచ్చు. ‘శివ’ సినిమా కూడా అంతే. అప్పట్లోనే పది కోట్లు వసూలు చేసింది. అస్సలు ఊహించలేదు. నంబర్‌ గేమ్‌ అనేది సినిమా సినిమాకి మారుతుంటుంది. వాటి గురించి నేను పట్టించుకోను. మనం తీసిన సినిమా జనాలకి నచ్చిందా లేదా అన్నది ముఖ్యం’’ అని నాగ్ అన్నాడు.

ప్రస్తుతం ఎవ్వరూ టచ్ చేయని కథను ఎంచుకోవడం వల్లే ‘సోగ్గాడే చిన్నినాయనా’ అంత పెద్ద విజయం సాధించిందని నాగ్ చెప్పాడు. ‘‘ఇటీవల కాలంలో స్టార్‌ ఇమేజ్‌ ఉన్న ఏ హీరో కూడా పల్లెటూరు నేపథ్యమున్న సినిమాలు చెయ్యడంలేదు. అందుకే నేను ట్రై చేశా. నాలుగు సినిమాల మధ్య కూడా మా సినిమాకు మంచి కలెక్షన్లు దక్కాయి. సక్సెస్‌ క్రెడిట్‌ అంతా కల్యాణ్‌కృష్ణకే చెందుతుంది. నేను చేసిన బంగార్రాజు పాత్రని, రామూ పాత్రని ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ టైంలో నాకు ఇలాంటి సక్సెస్‌ రావడం గొప్ప విషయమే. నిర్మాతగా కన్నా నటుడిగా నాకెంతో సంతృప్తి కలిగించిన చిత్రమిది. ‘సోగ్గాడే’కి సీక్వెల్‌ చేద్దామని ముందునుంచీ ఆలోచన ఉంది. అందుకే బంగార్రాజు టైటిల్‌ రిజిస్ట్రేషన్ చేయించా’’ అని నాగ్ చెప్పాడు.

Also Read:


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు