యాంకర్‌ అనసూయ బాగా సెల్ఫిష్‌

యాంకర్‌ అనసూయ బాగా సెల్ఫిష్‌

చేసింది చిన్న పాత్రే అయినప్పటికీ 'సోగ్గాడే చిన్నినాయనా'లాంటి బ్లాక్‌బస్టర్‌లో భాగమైనందుకు అనసూయ ఆనందిస్తోంది. రెండు సీన్లు, ఒక పాట మాత్రమే అని తెలిసినప్పుడు చేయకూడదని అనుకున్నా కానీ నాగార్జున తన అభిమాన నటుడు కావడంతో కాదనలేకపోయిందట. తనకి సినిమా రంగం కంటే టీవీనే ఇష్టమని, ఇక్కడ పాపులర్‌ అయి అవకాశాలు పెరిగినా కానీ టీవీ ఇండస్ట్రీ వదిలిపెట్టనని అనసూయ చెప్పింది. టీవీలో అయితే తానే సెంటరాఫ్‌ ఎట్రాక్షన్‌ అవుతానని, కానీ సినిమాల్లో తనపై అంత ఫోకస్‌ వుండదని, అందుకే తనకి టీవీ అంటేనే మక్కువ ఎక్కువ అంటూ, ఈ విషయంలో తాను స్వార్థపరురాలినని నవ్వేసింది.

క్షణం చిత్రంలో పోలీస్‌ పాత్ర చేసిన అనసూయ ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. సినిమాల్లో తను చేసిన ఫస్ట్‌ ఫుల్‌ ఫ్లెడ్జ్‌డ్‌ క్యారెక్టర్‌ ఇదేనని, తనని ఈ పాత్రలో ఎలా రిసీవ్‌ చేసుకుంటారో చూడాలని వుందని అనసూయ చెప్పింది. ఈ చిత్రం విడుదలైన తర్వాతే వేరే సినిమాలు ఒప్పుకుందామని అనుకుంటున్నానని, క్షణం తనకి తప్పకుండా సినీ రంగంలో పెద్ద బ్రేక్‌ అవుతుందని అనసూయ ఆశిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు