నాగార్జున రేంజ్‌ అందుకే పెరిగిందా?

నాగార్జున రేంజ్‌ అందుకే పెరిగిందా?

నాగార్జున ఎప్పుడూ స్టారే కానీ, ఆయన స్టార్‌డమ్‌ ఆతరం హీరోల వరకే పరిమితం అయింది. మనంకి ముందు ఒక పదేళ్లకి పైగా నాగార్జున సినిమాలు హిట్టయినా కానీ భారీగా వసూలు చేయలేదు. మనం సినిమాకి దాదాపు నలభై కోట్ల షేర్‌ వస్తే, దానికి చాలా కారణాలున్నాయని, అక్కినేని హీరోలంతా కలిసి నటించారని, అక్కినేని నాగేశ్వరరావు చివరి చిత్రమనే ఫ్యాక్టర్‌ హెల్ప్‌ అయిందని వాదించారు. కానీ 'సోగ్గాడే చిన్నినాయనా'తో విమర్శకుల నోళ్లు మూయించి, తన రేంజ్‌ ఏంటనేది నాగార్జున చూపించారు. నలభై అయిదు కోట్లకి పైగా షేర్‌ రాబట్టిన ఈ చిత్రం సంక్రాంతికి వచ్చిన భారీ చిత్రాలని ఎదుర్కొని బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది.

నాగార్జునకి ఈ రెండు, మూడేళ్లలో ఇంత క్రేజ్‌ ఎందుకు వచ్చింది? సడన్‌గా ఆయన సినిమాలకి జనం ఈ రేంజ్‌లో ఎగబడుతున్నారేంటని ట్రేడ్‌ పండితులు కూడా అనలైజ్‌ చేయడం మొదలు పెట్టారు. దీంట్లో 'మీలో ఎవరు కోటీశ్వరుడు' పాత్ర చాలా వుందని భావిస్తున్నారు. ఈ కార్యక్రమంతో నాగార్జున ప్రతి ఇంట్లోకి వెళ్లిపోయారు. ఇప్పుడాయన్ని చాలా మంది ఓన్‌ చేసేసుకుంటున్నారు. దీంతో మునుపటి కంటే ఎక్కువగా నాగ్‌ సినిమాలకి ఆదరణ పెరిగిందని, సినిమాలు కూడా బాగుండే సరికి రేంజ్‌ ఆటోమేటిగ్గా వచ్చేస్తోందని అనుకుంటున్నారు. ఈ ఊపులో మరో హిట్టిచ్చే కనుక నాగార్జునతో సినిమాలు తీయడానికి నిర్మాతలు అన్నపూర్ణ స్టూడియోస్‌ ముందు బారులు తీరినా ఆశ్చర్యం లేదు. ఇప్పటికే ఆయనతో చేస్తామని ప్రెజర్‌ పెడుతోన్న వారు భారీ సంఖ్యలోనే వున్నారట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు