వామ్మో బాలకృష్ణ ఇంత షాకిచ్చాడేంటి?

వామ్మో బాలకృష్ణ ఇంత షాకిచ్చాడేంటి?

బాలకృష్ణ వందవ సినిమా ఎవరి డైరెక్షన్‌లో వుంటుందనేది ఇంకా క్లియర్‌ అవలేదు. ఇప్పటికీ చాలా పేర్లు వినిపిస్తూనే వున్నాయి. 'ఆదిత్య 999' చేసేస్తున్నానని బాలకృష్ణ ప్రకటించినా కానీ ఎందుకో మనసు మార్చుకున్నారు. వందవ సినిమాపై వుండే అంచనాలకి తగ్గ సినిమానే చేయాలని డిసైడ్‌ అయ్యారు. దీంతో బోయపాటి శ్రీను పేరు మళ్లీ తెర మీదకి వచ్చింది. కానీ ఇంకా దానిపై క్లారిటీ అయితే రాలేదు. రామారావుగారు పేరుతో అనిల్‌ రావిపూడి ఒక కథ సిద్ధం చేస్తున్నాడని వార్తలొచ్చాయి. దిల్‌ రాజు నిర్మాణంలో ఈ సినిమా వుంటుందని కూడా ప్రచారం జరిగింది. అయితే అదెప్పుడనే దానిపై అధికారిక ప్రకటనేం రాలేదు.

Also Read: జగన్‌ కు చెమటలు పట్టిస్తున్న వైజాగ్‌

ఇదిలావుంటే క్రిష్‌ డైరెక్షన్‌లో బాలయ్య వందవ సినిమా వుంటుందనే షాకింగ్‌ న్యూస్‌ ఒకటి సర్కులేట్‌ అవుతోంది. క్రిష్‌ ఏంటి, బాలయ్య సినిమాకి డైరెక్షనేంటి, అది కూడా వందవ సినిమాకి బాలయ్య ఇలాంటి రిస్కు చేయడమేంటి పెద్ద డిస్కషన్‌ టాపిక్‌ అయి కూర్చుంది. క్రిష్‌ ఇంతవరకు మాస్‌ సినిమా తీసి ఎరుగడు. ఠాగూర్‌ని హిందీలోకి రీమేక్‌ చేసిన అనుభవం వుంది కానీ క్రిష్‌ ఆలోచనలు చాలా డిఫరెంట్‌గా వుంటాయి. మరి ఈ ఆడ్‌ కాంబినేషన్‌లో సినిమా అంటే అది అసలు ఎలా వుంటుందో? బాలకృష్ణ ఏదో ఒకటి ఫిక్స్‌ చేసేసి, దానిని సెట్స్‌ ఎక్కించే వరకు ఇలాంటి వార్తలు ఇంకెన్ని వినాలో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు