అమిత్‌ షా కాపు గేమ్‌ ప్లాన్‌ గీస్తున్నారా?

అమిత్‌ షా కాపు గేమ్‌ ప్లాన్‌ గీస్తున్నారా?

కాపు రిజర్వేషన్‌ ఉద్యమ నేపథ్యంలో విధ్వంసంలో పాల్గొన్నవారు, ప్రేరేపించినవారిపై కేసులు పెట్టిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సీరియస్‌ గా ఉన్న సంగతి తెలిసిందే. అయితే... ఆ కేసుల్లో ఒక కేసు విషయంలో బీజేపీ అధిష్ఠానం కూడా చంద్రబాబు ప్రభుత్వంపై సీరియస్‌ గా ఉందట. ముఖ్యంగా కాపు గర్జనకు వెళ్లిన బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణపై ఏపీ గవర్నమెంటు కేసు పెట్టడంపై సీరియస్గా ఉందని తెలుస్తోంది. కన్నాపై కేసు పెట్టిన విషయాన్ని ఏపీ బీజీపీ నేతలు అమిత్‌ షా దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఉద్యమం, ముద్రగడ దీక్ష ఆగిపోయినా కూడా కేసులపై మాత్రం ఏపీ పట్టుదలతో ఉంది. కానీ మిత్రపక్షమైన బీజేపీతో ఒక్కమాట కూడా చెప్పకుండా ఆ పార్టీకి చెందిన కన్నాపై కేసులు నమోదు చేయాడాన్ని అమిత్‌షా కూడా తప్పుపట్టినట్టు తెలుస్తోంది.  ఈ విషయంలో బీజేపీ పెద్దలకు టీడీపీ నేతలు కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని సమాచారం.

తాజాగా రాష్ట్ర బీజేపీ నేతలకు ఫోన్‌ చేసిన అమిత్‌షా ముఖ్యంగా కాపుల బలంపైనా ఆరా తీశారట. కాపుల జనాభా శాతం.. వారిలో టీడీపీపై ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందన్న విషయాలను అడిగితెలుసుకున్నారట. కాపులు జనాభా అధికంగా ఉన్న నేపథ్యంలో వారికి అనుకూలంగానే ముందుకెళ్లాలని బీజేపీ భావిస్తోంది.  కన్నాపై కేసు నమోదును బేస్‌ చేసుకుని ప్రభుత్వాన్ని తప్పుపట్టే యోచనలో కమలనాథులు ఉన్నారు.

అయితే... కన్నాపై కేసు పెట్టాలని ప్రభుత్వం తొలుత అనుకోకపోయినా గతంలో కన్నా ఏపీ ప్రభుత్వంపై చేసిన విమర్శల నేపథ్యంలో ఆయన్ను కట్టడిచేయడానికే కేసు పెట్టినట్లు తెలుస్తోంది. కాపుల ఉద్యమం, కేసులు... కన్నా వ్యవహారం వంటివన్నీ ఆరా తీసిన అమిత్‌ షా తాజాగా ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు వద్ద మాత్రం ఈ విషయాలేవీ ప్రస్తావించలేదని... గుంభనంగా ఉన్నారని తెలుస్తోంది. కాపులను బీజేపీకి అనుకూలంగా ఎలా ఉపయోగించుకోవాలా అని అమిత్‌ షా పథక రచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English