మనోజ్‌ ఆమె పెళ్లిచూపులు చెడగొట్టాడా?

మనోజ్‌ ఆమె పెళ్లిచూపులు చెడగొట్టాడా?

మంచు మనోజ్‌ ఓ అమ్మాయి పెళ్లి చూపులు చెడగొట్టాడట. ఇది ఏ సినిమాలోని సన్నివేశం అని అడక్కండి. నిజ జీవితంలోనే మనోజ్‌ ఆ పని చేశాడు. ప్రస్తుతం అతడి భార్యగా ఉన్న ప్రణతి ఒకప్పుడు వేరే అబ్బాయిని చూడ్డానికి వెళ్లినపుడు ఆ మీటింగ్‌ను చెడగొట్టి ఆమెను సేవ్‌ చేశాడట మనోజ్‌. వీళ్లిద్దరి మధ్య స్నేహం మొదలై.. అది ప్రేమగా మారడానికి ఒక రకంగా ఆ సంఘటనే కారణమట. ఆదివారం ప్రేమికుల దినోత్సవం నేపథ్యంలో ప్రణతితో తన ప్రేమ కథ గురించి ఓ ఇంటర్వ్యూలో చెబుతూ ఈ విషయాన్ని వెల్లడించాడు మనోజ్‌. ఆ విశేషాలేంటో అతడి మాటల్లోనే తెలుసుకుందాం పదండి.

''ప్రణతి మా వదిన వాళ్ల క్లాస్‌ మేట్‌. ఆమెను కలవడానికి ఓసారి మా ఇంటికొచ్చింది. మొదటిసారి తనను చూసినపుడే పెళ్లంటూ చేసుకుంటే ఇలాంటమ్మాయినే చేసుకోవాలని అనుకున్నా. రెండో రోజు జరిగిన ఓ సంఘటన మా ఇద్దరినీ దగ్గర చేసింది. ఆ రోజు నేను ఓ ఫ్రెండుతో కలిసి రెస్టారెంటుకి వెళ్లాను. కాసేపయ్యాక వదిన, ప్రణతి, ఓ అబ్బాయి అక్కడికొచ్చారు. విషయం ఏంటని అడిగితే.. 'తనకిష్టం లేకపోయినా ఇంట్లోవాళ్లు బలవంతంగా ఈ అబ్బాయిని కలిసే ఏర్పాటు చేశారు. ఇది అనఫీషియల్‌ పెళ్లి చూపులు' అని చెప్పింది.

వెంటనే మధ్యలో నేను దూరిపోయా. ఏవేవో చెప్పేసి అర్జెంట్‌ పని అని చెప్పిప్రణతిని అక్కడి నుంచి తీసుకెళ్లిపోయా. ఆ క్షణంలో ఎందుకలా చేయాలనిపించిందో.. ఆ ధైర్యం ఎలా వచ్చిందో తెలియదు. ఆ తర్వాత మా ఇద్దరి మధ్యం బంధం మొదలైంది. నాన్నకు తన గురించి చెబితే.. మూడు నిమిషాల్లో తేల్చేసి ఆశీర్వదించారు'' అని మనోజ్‌ వెల్లడించాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English