అమ్మేయండి బాస్‌ అంటున్న తమిళ స్టార్‌..

అమ్మేయండి బాస్‌ అంటున్న తమిళ స్టార్‌..

అమ్మేయండి బాస్‌ అంటూ ఓఎల్‌ఎక్స్‌ యాడ్‌ లో అల్లుఅర్జున్‌  చెప్పే డైలాగ్‌ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు తమిళ హీరోలు కూడా ఈ యాడ్‌ నే ఫాలో అవుతున్నట్లున్నారు. ఒక్కసారి తెలుగు ప్రేక్షకులకు తమ పేరు పరిచయం అయితే చాలు.. ఆ పేరు చెప్పి గత సినిమాలన్నీ తెలుగులోకి తెచ్చేస్తుంటారు. ధనుష్‌, సూర్య, విక్రమ్‌.. ఇలా వీళ్లంతా ఇదే లిస్ట్‌ లోకి వచ్చే హీరోలే. ఇప్పుడు తాను కూడా ఇదే లిస్ట్‌ లో ఉన్న హీరోనే అని చెబుతున్నాడు జయం రవి. ఈయన సినిమాలు తెలుగులో ఏదీ హిట్టవ్వలేదు. కానీ ఈ మధ్య జయం రవి పేరు తెలుగులో బాగా వినిపించింది. దానికి కారణం రామ్‌ చరణ్‌.

ఈ హీరో ప్రస్తుతం నటిస్తున్న తని ఒరువన్‌ ఒరిజినల్‌ లో జయంరవి హీరో. అలా మనోడి పేరు ఇక్కడ పాపులర్‌ అయింది. ప్రస్తుతం ఈ హీరో నటిస్తున్న మిరుథన్‌ సినిమాను తెలుగులో యమపాశం పేరుతో  దించేస్తున్నారు. రవికి ఇక్కడ మార్కెట్‌ లేకపోయినా.. కేవలం రామ్‌ చరణ్‌ రీమేక్‌ చేస్తున్న సినిమాలో హీరో అనే ఒకేఒక్క క్రేజ్‌ తో జయం రవి మిరుథన్‌ సినిమా తెలుగులోకి వస్తుంది. ఫిబ్రవరి 19న ఈ సినిమా విడుదల కానుంది.

ఓ సైంటిఫిక్‌ వైరస్‌ వల్ల మనుషుల్లో ఎలాంటి పరిణామాలు వస్తాయి అనే విభిన్నమైన కాన్సెప్ట్‌ తో తెరకెక్కింది మిరుథన్‌. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ కు సూపర్‌ రెస్పాన్స్‌ వచ్చింది. ఇందులో జయం రవికి జోడీగా లక్ష్మీమీనన్‌ నటించింది. ఈ సినిమా ఏ భాషలోనైనా హిట్టవుతుందనే నమ్మకంతోనే తెలుగులోకి తీసుకొస్తున్నామంటున్నాడు జయం రవి. మరి మిరుథన్‌ తో తెలుగులోనూ ఈ హీరో జయం అందుకుంటాడో లేదో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు