దిమ్మ తిరిగే దిమ్మా తిరిగే... సమంతా!

దిమ్మ తిరిగే దిమ్మా తిరిగే... సమంతా!

చూడ్డానికి పిట్టంత వుంటుంది కానీ వంద కేజీలకి పైగా బరువుని చులాగ్గా ఎత్తేసి దించేస్తోంది సమంత. బాడీ బిల్డింగ్‌లో డెడ్‌లిఫ్టింగ్‌ అనే ప్రక్రియకి సాధారణంగా అమ్మాయిలు దూరంగా వుంటారు. బాడీ బిల్డింగ్‌ మీద మోజు వున్న వారు మినహా ఇలాంటి బరువైన పనులు తలకెత్తుకోరు. కానీ సమంత మాత్రం మరోసారి తన బల ప్రదర్శనతో షాకిచ్చింది. ఇంతకుముందు కూడా సమంత ఫిట్‌నెస్‌ వీడియో ఒకటి నెట్‌లో హల్‌చల్‌ చేసింది.

ఆమె ట్రెయినర్‌ సమంతతో మూడు రెప్స్‌ డెడ్‌లిఫ్టింగ్‌ చేయించి, వీడియో తీసి మరీ ట్విట్టర్‌లో పెట్టాడు. అంతే సమంత దూకుడు చూసి జనమంతా నోరెళ్లబెట్టి వా సమంతా వా.. అంటూ పొగిడేస్తున్నారు. సినిమాల్లో గ్లామరస్‌ పాత్రలు మాత్రమే చేసే సమంత ఫిట్‌గా వుండడం కోసం ఇంత రిస్కు చేయనక్కరలేదు. అయినా కానీ ఇలాంటివి చేస్తోందంటే ఏదైనా యాక్షన్‌ సినిమా చేసి తనలోని మరో కోణం చూపించాలనే సరదా ఆమెకి వున్నట్టుంది. సమంత వీడియోలు చూసి అయినా ఆమెలోని విజయశాంతిని గుర్తించి తగిన సినిమాతో మనందరినీ అలరించేదెవరో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English