మహేష్‌బాబుతో రెండు ఫ్రీ

మహేష్‌బాబుతో రెండు ఫ్రీ

బ్రహ్మూెత్సవం చిత్రం శాటిలైట్‌ హక్కుల్ని జీ తెలుగు ఛానల్‌ కనీ వినీ ఎరుగని రేటుకి కొనేసిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అధికారికంగా ఆ మొత్తం ఎంతనేది బయటకి రాకపోయినా కానీ ఇరవై కోట్లు ఇచ్చారంటూ మీడియాలో కొందరు ప్రచారం చేస్తున్నారు. అయితే మరీ అంత కాకపోయినా ఖచ్చితంగా చాలా మంచి డీల్‌ అనేది విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇకపోతే ఈ చిత్రం కొన్న జీ తెలుగు వారికి పివిపి సినిమా వారు తీసిన రెండు సినిమాల్ని ఉచితంగా ఇచ్చేసారట.

అనుష్క, ఆర్య నటించిన వర్ణ, సైజ్‌ జీరో చిత్రాల శాటిలైట్‌ హక్కులు ఇంతవరకు అమ్మలేదు. ఆ సినిమాల్ని బ్రహ్మూెత్సవంతో కలిపి ఇచ్చేసారట. విడిగా అమ్మి వుంటే ఎంత పలికి వుండేవో కానీ మహేష్‌ సినిమాతో పాటు ఫ్రీగా ఇచ్చేయడంతో, ప్యాకేజీ డీల్‌తో బాబు ఖాతాలో ఒక రికార్డు అయితే జమయింది. ఎప్పుడో మే నెలలో విడుదలయ్యే సినిమా హక్కుల్ని ఇంత ముందుగా కొనేసారంటే, అది కూడా అంత పెద్ద మొత్తానికి కొన్నారంటే దీనిపై వున్న అంచనాలు ఏంటనేది అర్థం చేసుకోవచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు