జ్నానోదయం అయ్యిందంటున్న నాని

జ్నానోదయం అయ్యిందంటున్న నాని

తన గత సినిమాల అనుభవాలతో తనకో విషయం స్పష్టంగా అర్థమైందని అంటున్నాడు నాని. తనకు రెగ్యులర్‌ మసాలా సినిమాలు నప్పవని.. ప్రేక్షకులు తన నుంచి ఏదో ఒక కొత్తదనం ఆశించే థియేటర్లకు వస్తారనే సంగతి తెలుసుకున్నానని నాని చెప్పాడు. ''కమర్షియల్‌ సినిమాలు, రెగ్యులర్‌ మూవీస్‌ నాకు సూట్‌ కావని అర్థమైంది. మామూలుగానే ప్రేక్షకులిప్పుడు కొంచెం వినోదం జోడించిన డిఫరెంట్‌ మూవీస్‌ చూడ్డానికి ఇష్టపడుతున్నారు. అందులోనూ నా లాంటి హీరోల నుంచి ఇలాంటి తరహా సినిమాలు ఎక్కువ ఆశిస్తున్నారు'' అని నాని అన్నాడు.  భలే భలే మగాడివోయ్‌ ఆ స్థాయిలో విజయం సాధిస్తుందని ఊహించలేదని.. కొన్ని పెద్ద సినిమాల కంటే కూడా తన సినిమా ఎక్కువ వసూళ్లు రాబట్టిందని తెలిసి ఆశ్చర్యపోయానని.. ఇకపైనా ఈ తరహా సినిమాలే చేయాలని నిర్ణయించుకున్నానని నాని చెప్పాడు.

ఈ శుక్రవారం విడుదల కాబోతున్న తన కొత్త సినిమా 'కృష్ణగాడి వీర ప్రేమగాథ' గురించి చెబుతూ.. ''నా కెరీర్లో ఏ సినిమా మీద కూడా ఇంత కాన్ఫిడెంటుగా లేను. మామూలుగా అయితే నా సినిమాల విడుదలకు ముందు చాలా టెన్షన్‌ పడుతుంటాను. నిద్ర పట్టదు, తిండి తినాలనిపించదు. కానీ ఈ సినిమా విషయంలో నాకు ఎలాంటి టెన్షన్‌ లేదు. అంత కాన్ఫిడెన్స్‌ ఉంది ఈ సినిమా మీద. ఒక యునీక్‌ పాయింట్‌ తో తెరకెక్కిన సినిమా ఇది. నా నుంచి ప్రేక్షకులు ఆశించే వినోదం ఉంటుంది. రెండున్నర గంటల పాటు వినోదంలో ముంచెత్తుందీ సినిమా. దర్శకుడు హను రాఘవపూడి ఈ సినిమా కోసం మామూలు కష్టం పడలేదు. అతడి కోసమైనా ఈ సినిమా హిట్టవ్వాలి'' అన్నాడు నాని.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు