రత్నాచల్‌ ను కాల్చేసిన చోటే పూలతో స్వాగతం

రత్నాచల్‌ ను కాల్చేసిన చోటే పూలతో స్వాగతం

కాపుల్ని బీసీల్లోకి చేర్చాలంటూ కాపు ఐక్య గర్జన చేప్టటటం..ఈ కార్యక్రమం ఉద్రిక్తంగా మారటం.. ఆపై రైల్‌ రోకో ఆందోళనలో భాగంగా గత ఆదివారం రత్నాచల్‌ ఎక్స్‌ ప్రెస్‌ ను తగలబెట్టేయటం తెలిసిందే. కోస్తా.. గోదావరి.. ఉత్తరాంధ్ర ప్రజలకు నిత్యం రవాణా సౌకర్యానికి వీలుండే రత్నాచల్‌ ఎక్స్‌ ప్రెస్‌ లేకపోవటంతో ఈ ప్రాంతాలకు చెందిన ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్న పరిస్థితి.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యక్తిగతంగా రియాక్ట్‌ అయి.. కాల్చేసిన రత్నాచల్‌ స్థానంలో కొత్త రైలును తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు షురూ చేయటంతో కేవలం వారం వ్యవధిలోనే రత్నాచల్‌ ఎక్స్‌ ప్రెస్‌ రైలు పట్టాలకు ఎక్కింది. 24 బోగీలతో నడిచే ఈ రైలుబండిని ప్రస్తుతం 17 బోగీలతో నడిపిస్తున్నారు. సోమవారం నుంచి స్టార్ట్‌ అయిన రత్నాచల్‌ ఎక్స్‌ ప్రెస్‌ బండిని తుని స్టేషన్‌ లో అపూర్వ స్వాగతం లభించింది.

వారం కిందట ఇదే స్టేషన్లో అగ్నికి ఆహుతైన రత్నాచల్‌ కు.. సోమవారం మాత్రం అక్కడి స్థానికులు పూల దండలతో స్వాగతం పలికారు. అంతేకాదు.. రత్నాచల్‌ డ్రైవర్‌ కు పూలదండలు వేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. వారం వ్యవధిలో తిరిగి రైలుబండి పట్టాల మీదకు ఎక్కటం పట్ల కోస్తా.. గోదావరి.. ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English