లారెన్స్‌ కొత్త అవతారం

లారెన్స్‌ కొత్త అవతారం

లారెన్స్‌ హీరో అవుతున్నాడు అని ఒకప్పుడు అంటే తెగ నవ్వేసుకున్నారు జనాలు. ఆ కలర్‌తో హీరో ఏంటి అని. అలాగే అతను దర్శకుడిగా మారుతున్నాడని తెలిసినప్పుడూ ఇలాగే నవ్వారు. అతడి టాలెంటుకి డైరెక్షన్‌ ఏంటి అని. కానీ రెండు విషయాల్లోనూ తనేంటో రుజువు చేసుకున్నాడు లారెన్స్‌. లేటెస్టుగా కాంఛన-3 (గంగ) సినిమాతో అటు దర్శకుడిగా, ఇటు నటుడిగా తనేంటో మరోసారి ప్రూవ్‌ చేసుకున్న లారెన్స్‌.. ప్రస్తుతం 'పటాస్‌' తమిళ రీమేక్‌ 'మొట్ట శివ కెట్ట శివ'లో కథానాయకుడిగా నటిస్తున్నాడు. దీని తర్వాత కాంఛన సిరీస్‌లో ఇంకో సినిమా కూడా చేయాల్సి ఉంది.

ఐతే లారెన్స్‌ యాక్టింగ్‌ టాలెంట్‌ చూసి అతడికి ఇంకో మంచి ఆఫర్‌ ఇస్తున్నారు కోలీవుడ్లో. ఐతే అది హీరో వేషం కాదు. విలన్‌ పాత్ర. పిజ్జా, జిగర్‌ తాండా లాంటి సెన్సేషనల్‌ సినిమాలు తీసిన యంగ్‌ డైరెక్టర్‌ కార్తీక్‌ సుబ్బరాజ్‌ అతడికి ఓ మాంచి విలన్‌ క్యారెక్టర్‌ ఆఫర్‌ చేశాడట. రెండేళ్ల క్రితం సెన్సేషనల్‌ హిట్టయిన 'జిగర్‌ తాండా'కు సీక్వెల్‌ చేయాలనుకుంటున్నాడు కార్తీక్‌. తొలి భాగంలో బాబీ సింహాకు జాతీయ అవార్డు తెచ్చిపెట్టిన పాత్రకు కొనసాగింపుగా విలన్‌ పాత్రను మరింత ప్రత్యేకంగా తీర్చిదిద్దిన కార్తీక్‌ ఈసారి ఆ పాత్రకు బాబీని కాకుండా లారెన్స్‌ను ఎంచుకున్నాడట. లారెన్స్‌ కూడా పాత్ర నచ్చి ఓకే చెప్పాడట. దీని కోసం లారెన్స్‌ గెటప్‌ పూర్తిగా మార్చేయబోతున్నట్లు సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English