రుణాలు తీర్చే పనిలో పవన్‌

రుణాలు తీర్చే పనిలో పవన్‌

పవన్‌ కళ్యాణ్‌ ఎవరి రుణమూ ఉంచుకునేలా లేడు. అందులోనూ తన కెరీర్లో ఒకప్పుడు బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచిన 'ఖుషి' విషయంలో అయితే పవన్‌ మరింత కృతజ్నత చూపిస్తున్నట్లున్నాడు. ఆ సినిమా డైరెక్టర్‌ ఫామ్‌లో లేడని తెలిసి కూడా ఆ మధ్య 'పులి' సినిమా చేయడమే కాదు.. అది డిజాస్టర్‌ అయినా లెక్క చేయకుండా ఇప్పుడు మళ్లీ ఇంకో అవకాశం ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

ఇప్పుడిక ఆ చిత్ర నిర్మాత ఎ.ఎం.రత్నం రుణం కూడా తీర్చేసే పనిలో ఉన్నట్లున్నాడు. ఎస్‌.జె.సూర్యతో సినిమా తర్వాత పవన్‌ చేయబోయే 'వేదాలం' రీమేక్‌ను నిర్మించబోయేది రత్నమేనట.

అసలు వేదాలం రీమేక్‌ను తెరమీదికి తెచ్చిందే రత్నం అని సమాచారం. ఒకప్పుడు భారీ సినిమాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన రత్నం.. మధ్యలో వరుస ఫ్లాపుల కారణంగా ఇండస్ట్రీకి దూరమయ్యాడు. ఈ మధ్య మళ్లీ సినిమాలు చేస్తూ పైకి లేచే ప్రయత్నంలో ఉన్నాడు. అజిత్‌తో ఆరంభం, ఎన్నై అరిందాల్‌, వేదాలం సినిమాలు ఆయన్ని నిలబెట్టాయి.

ఇక తెలుగులోనూ పూర్వ వైభవం పొందాలని చూస్తున్న రత్నం తన నిర్మాణంలో వచ్చిన 'వేదాలం'నే రీమేక్‌ చేద్దామని నిర్ణయించుకుని.. పవన్‌ను సంప్రదించాడట. తనకు 'ఖుషి' లాంటి బ్లాక్‌బస్టర్‌ ఇచ్చాడన్న కృతజ్నతతో పవన్‌ ఓకే అనేశాడట. ఈ చిత్రానికి కందిరీగ ఫేమ్‌ సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకుడని ప్రచారం జరుగుతున్నప్పటికీ ఇంకా ఏదీ ఖరారు కాలేదని అంటున్నాడు రత్నం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు