గోపీచంద్‌ సరసన స్కూల్‌ పాప

గోపీచంద్‌ సరసన స్కూల్‌ పాప

'సౌఖ్యం' సినిమాతో గట్టి ఎదురు దెబ్బే తిన్నాడు గోపీచంద్‌. ఇక రొటీన్‌ సినిమాలు వదిలేసి కొంచెం డిఫరెంటుగా ఏదైనా ట్రై చేస్తే తప్ప గోపీ కెరీర్‌ మళ్లీ ఊపందుకోవడం కష్టమన్నట్లే ఉంది. ఇలాంటి సమయంలోనే వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లు ఎ.ఎం.రత్నం తనయుడు జ్యోతికృష్ణ 'ఆక్సిజన్‌' అనే సరికొత్త స్క్రిప్టు పట్టుకొచ్చి గోపీని కలిశాడు.

రత్నం నిర్మాణంలోనే ఈ సినిమా చడీచప్పుడు లేకుండా షూటింగ్‌ జరుపుకుంటోంది. పేరుకు తగ్గట్లే ఇదో వైవిధ్యమైన సినిమా అని చెబుతున్నారు. ఈ సినిమాలో గోపీ సరసన 'జిల్‌' భామ రాశి ఖన్నా లీడ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.

'ఆక్సిజన్‌'లో ఇంకో హీరోయిన్‌కు కూడా చోటుంది. ఆ పాత్ర చాలా బోల్డ్‌ గా, సెన్సేషనల్‌ గా ఉంటుందని దాని గురించి చాలా చెబుతున్నాడు డైరెక్టర్‌ జ్యోతికృష్ణ. ఈ పాత్రకు మలయాళ అమ్మాయి అను ఇమ్మాన్యుయెల్‌ ను తీసుకున్నారు. ఈమె ఓ ఎన్నారై బేస్డ్‌ మోడల్‌.

ఐదేళ్ల కిందట జయరాం హీరోగా తెరకెక్కిన ఓ మలయాళ సినిమాలో స్కూల్‌ పాపగా నటించింది. ఇటీవలే విడుదలై హిట్‌ టాక్‌ తో నడుస్తున్న నివిన్‌ పౌలీ సినిమా 'యాక్షన్‌ హీరో బిజు'లో హీరోయిన్‌ అవతారమెత్తింది. అట్నుంచి నేరుగా తెలుగులో అడుగుపెట్టేయబోతోంది. హీరోయిన్‌ గా తొలి సినిమాలో బాగానే అందాలు ఆరబోసిన అను.. చాలా 'బోల్డ్‌' అని చెబుతున్న పాత్రలో ఎలా కనిపిస్తుందో మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు