ఈడీ విచారణకు జగన్‌ ఢిల్లీకి వెళ్లట్లేదు

ఈడీ విచారణకు జగన్‌ ఢిల్లీకి వెళ్లట్లేదు

నిజమే..  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్మోహన్‌ రెడ్డి ఢిల్లీకి వెళ్లటం లేదు. అక్రమాస్తుల కేసులో విచారణ కోసం ఢిల్లీకి రావాల్సిందిగా ఈడీ ఆదేశాలు జారీ చేయటం తెలిసిందే. అయితే..ఈ వ్యవహారాన్ని గుట్టుగా పూర్తి చేయాలని జగన్‌ భావించినా.. అది సాధ్యం కాలేదు. ఆయన ఢిల్లీ పర్యటనపై మీడియాలో విస్తృతంగా ప్రచారం జరగటంతో ఆయన వెనక్కి తగ్గినట్లు తెలుస్తుంది. ఈడీ విచారణ విషయంలో మీడియాలో జరిగిన ప్రచారం ఒకదశలో.. జగన్‌ మళ్లీ అరెస్ట్‌ తప్పదన్న వరకూ వెళ్లటం తెలిసిందే.

దీంతో.. ఈడీ విచారణ కోసం ఢిల్లీకి వెళ్లకుండా ఉన్న ప్రత్యామ్నాయాల్ని పరిశీలించిన జగన్‌.. ఢిల్లీకి రాకుండా హైదరాబాద్‌ లోని ఈడీ కార్యాలయం ఎదుట హాజరవుతానని కోరటం.. అనివార్య కారణాల వల్ల తాను హాజరు కాలేకపోతున్నట్లుగా ఆయన పేర్కొన్నట్లు తెలిసింది. జగన్‌ వివరణకు ఓకే అన్న ఈడీ జగన ఢిల్లీకి రావాల్సిన అవసరం లేదని పేర్కొనటంతో జగన్‌ ఢిల్లీ టూర్‌ వాయిదా పడినట్లు చెబుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు