సిక్స్ ప్యాక్‌పై అనుష్క మోజు

సిక్స్ ప్యాక్‌పై అనుష్క మోజు

క‌థానాయ‌కులకు తీసుపోనని నిరూపించాల‌నుకొంటోంది అనుష్క. త్వర‌లో సిక్స్ ప్యాక్ కండ‌ల‌తో క‌నిపిస్తాన‌ని చెబుతోంది. ఈ ముద్దుగ‌మ్మ రుద్రమ‌దేవి, బాహుబ‌లికోసం బ‌రువు త‌గ్గి దేహాన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దుకొంది. ఫిజిక‌ల్ ట్రైన‌ర్‌ల‌ను నియ‌మించుకొని ఫిట్‌గా త‌యార‌యింది. యోగా టీచ‌ర్ అయిన అనుష్క స్వత‌హాగా ఎప్పుడూ ఫిట్‌గా ఉండేందుకే ప్రయ‌త్నిస్తుంటుంది.

ఇప్పుడు చేస్తున్న రుద్రమ‌దేవి, బాహుబ‌లి సినిమాల్లో క‌త్తియుద్ధాలు, గుర్రపుస్వారీలు చేయాల్సిరావ‌డంతో ఫిజిక‌ల్ ట్రైన‌ర్‌ల‌ను అపాయింట్ చేసుకొని క‌స‌ర‌త్తులు చేస్తోంది. ప‌నిలోప‌నిగా దేహాన్ని సిక్స్ ప్యాక్ కండ‌ల‌తో సిద్ధం చేసుకోవాల‌ని ఆమె నిర్ణయించుకొంద‌ట‌. అయితే ద‌ర్శకులు ఇప్పుడొద్దని స‌ల‌హా ఇచ్చార‌ట. దీంతో చేతిలో ఉన్న ఈ రెండు సినిమాలు అయ్యాక సిక్స్ ప్యాక్ ప‌ని ప‌ట్టాల‌ని చూస్తోంది అనుష్క. ఇదే క‌నుక నిజ‌మైతే భ‌విష్యత్తులో యాక్షన్ నేప‌థ్యమున్న క‌థ‌ల్ని అనుష్క కోసం సిద్ధం చేస్తారేమో ద‌ర్శకులు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు