జక్కన్న కీ ఇచ్చాడు.. దూసుకెళ్తోంది

జక్కన్న కీ ఇచ్చాడు.. దూసుకెళ్తోంది

90ల్లో హీరోయిన్‌గా తెలుగు సినిమాను ఓ ఊపు ఊపిన రమ్యకృష్ణ.. కృష్ణవంశీని పెళ్లాడాక జోరు తగ్గించేసింది. మంచి నటే అయినప్పటికీ.. ఆమె టాలెంటుని వాడుకున్న వాళ్లు చాలా తక్కువమంది. హీరోయిన్‌గా పీక్స్‌లో ఉన్నపుడు ఆమెకందరూ గ్లామర్‌ రోల్సే ఇచ్చారు.

'నరసింహా' లాంటి సినిమాలు ఆమె కెరీర్లో చాలా తక్కువగా కనిపిస్తాయి. క్యారెక్టర్‌ రోల్స్‌లోకి మారాక కూడా ఆమె టాలెంటుని ఎవరూ సరిగా ఉపయోగించుకోలేదు. కానీ రాజమౌళి మాత్రం 'బాహుబలి'లో శివగామిగా రమ్యకు ఓ పవర్‌ ఫుల్‌ రోల్‌ ఇచ్చి ఆమె కెరీర్‌ను మలుపు తిప్పాడు. రమ్యకృష్ణలో ఇంత నటన ఉందా అని అంతా ఆశ్చర్యపోయారు ఈ సినిమా చూసి.

ఇప్పుడిక వరుసగా ఆమెకు మంచి పాత్రలు దక్కుతున్నాయి. ఇప్పటికే కృష్ణవంశీ దర్శకత్వంలో 'రుద్రాక్ష'లో ఓ కీలక పాత్రకు ఎంపికైన రమ్యను కమల్‌ హాసన్‌ కూడా తన కొత్త సినిమా కోసం ఎంచుకోవడం విశేషం. ప్రస్తుతం తన మిత్రుడు, మలయాళ దర్శకుడు రాజీవ్‌ దర్శకత్వంలో 'అమ్మా నాన్న ఆట' అనే సినిమా చేస్తున్న కమల్‌.. ఆ తర్వాత కూడా అదే దర్శకుడితో ఓ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఈ చిత్రానికి కథ కమల్‌దే. ఇందులో శ్రుతి హాసన్‌ కమల్‌ కూతురిగా నటించబోతుండటం విశేషం. ఈ సినిమాలో రమ్యకృష్ణ కమల్‌కు జోడీగా నటించబోతోందట.

ఇంతకుముందు కమల్‌తో కలిసి 'పంచతంత్రం' అనే సినిమా చేసింది రమ్య. ఐతే అందులో ఆమెది ఫుల్‌ లెంగ్త్‌ రోల్‌ కాదు. వ్యాంప్‌ క్యారెక్టర్‌. ఈసారి మాత్రం కమల్‌కు జోడీగానే నటించబోతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు