18 కేంద్రాల్లో గుండె జారింది

18 కేంద్రాల్లో గుండె జారింది

నితిన్ క‌ల‌లు సాకార‌మ‌య్యాయి. ఒక్క మంచి విజ‌యం ల‌భిస్తే చాల‌నుకొన్న ఈ హీరో ఆశ‌లు ఎట్టకేల‌కు ఫ‌లించాయి. గుండెజారి గ‌ల్లంత‌య్యిందే సినిమా చ‌క్కటి విజ‌యాన్ని సొంతం చేసుకొంది. 18 కేంద్రాల్లో వంద రోజులు పూర్తి చేసుకొంది. నితిన్‌కి ఈ త‌ర‌హా విజ‌యం లేక  చాలా కాల‌మే  అయ్యింది. యాక్షన్ బాట‌లో ప్రయాణం చేసి ప‌రాజ‌యాల‌ను చ‌విచూసిన నితిన్‌... చివ‌రికి  త‌న‌కు త‌గ్గ క‌థ‌ల‌పై దృష్టి సారించాడు. వినోదాలు పుష్కలంగా ఉన్న ప్రేమ‌కథ‌ల‌పై దృష్టిపెట్టాడు. ఆ ప్రయ‌త్నం చ‌క్కటి ఫ‌లితాన్నిచ్చింది. ఇష్క్, గుండె జారి గ‌ల్లంత‌య్యిందే... ఇలా వ‌రుస‌గా విజ‌యాలు ద‌క్కాయి.

ఇక‌పై కూడా ఇలాంటి క‌థ‌ల్లోనే న‌టించ‌బోతున్నాన‌ని ప్రక‌టించాడు. గుండెజారి విజ‌యం వెన‌క‌... ద‌ర్శకుడు, సాంకేతిక బృందం స‌హ‌కారం మ‌రిచిపోలేనిద‌ని చెప్పారు. ఇప్పుడు చేస్తున్న కొరియ‌ర్ బాయ్ క‌ల్యాణ్‌, హార్ట్ ఎటాక్‌.... నాకు మ‌రింత పేరు తీసుకొస్తాయ‌న్న న‌మ్మక‌ముంద‌ని తెలిపారు. పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శక‌త్వంలో తెర‌కెక్కనున్న "హార్ట్ ఎటాక్" వ‌చ్చే నెల‌లోనే సెట్స్ పైకి వెళ్ళబోతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు