పవన్‌తో పెద్ద గొడవేమీ లేదంటున్నాడు

పవన్‌తో పెద్ద గొడవేమీ లేదంటున్నాడు

'నాన్నకు ప్రేమతో' సినిమా రిలీజ్‌కు సరిగ్గా ఒక రోజు ముందు ఆ చిత్ర నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌. ప్రసాద్‌ మీద హీరో పవన్‌ కళ్యాణ్‌ మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్లో ఫిర్యాదు చేయడం తెలిసిందే. 'అత్తారింటికి దారేది' సినిమాకు సంబంధించి రెమ్యూనరేషన్‌ బ్యాలెన్స్‌ ఇవ్వలేదంటూ పవన్‌ కంప్లైంట్‌ ఇవ్వడం సంచలనం రేపింది. ఈ విషయంలో పవన్‌ నుంచి ఎలాంటి రెస్పాన్స్‌ ఏమీ లేదు కానీ.. ప్రసాద్‌ మాత్రం స్పందించాడు. పవన్‌తో పెద్ద గొడవేమీ లేదని ఆయనంటున్నాడు. ''అత్తారింటికి దారేది సినిమాకు సంబంధించి పారితోషకం విషయంలో నాకూ, పవన్‌ కల్యాణ్‌కూ మధ్య వచ్చింది చిన్న సమస్య. త్వరలోనే అది పరిష్కారం అయిపోతుంది. కుదిరితే నా తర్వాతి సినిమా పవన్‌ కళ్యాణ్‌తోనే చేయొచ్చేమో'' అని వ్యవహారాన్ని సింపుల్‌గా తేల్చేశాడు ప్రసాద్‌.

తన లేటెస్ట్‌ రిలీజ్‌ 'నాన్నకు ప్రేమతో'కు మొదట డివైడ్‌ టాక్‌ వచ్చినా కంగారు పడలేదని.. చివరికి తన నమ్మకమే నిజమై సినిమా అద్భుత విజయం సాధించిందని ప్రసాద్‌ చెప్పాడు. ''ఎన్నో సినిమాలు తీసిన నిర్మాతగా సినిమా ఎప్పుడు నిలబడుతుందనే విషయం మీద నాకు అవగాహన ఉంది. అందుకే డివైడ్‌ టాక్‌ వచ్చినా కంగారుపడలేదు. నా నమ్మకం నిజమైంది. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ప్రేమించారు కాబట్టే మంచి వసూళ్లు దక్కాయి. ఇక ఈ సినిమాకు లండన్‌ బ్యాగ్రౌండ్‌ తీసుకోవడం మీద జనాలు విమర్శించారు. ఇదే సినిమా హైదరాబాద్‌లో కూడా తీయొచ్చన్నారు. ఐతే అది కథకు తగ్గ లొకేషన్‌. అక్కడ తీయడం వల్లే కథ ఎలివేట్‌ అయ్యింది'' అని ప్రసాద్‌ చెప్పారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు