రాణా సినిమాపై భారీ అంచనాలున్నాయ్!

రాణా సినిమాపై భారీ అంచనాలున్నాయ్!

దగ్గుబాటి రాణా నటిస్తున్న ఒక సినిమాపై తమిళంలో భారీ అంచనాలున్నాయట! మరి మనోడి కెరీర్ లో సూపర్ హిట్లేమీ లేవు కదా.. అలాంటిది ఇతడి సినిమాపై భారీ అంచనాలుండటం ఏమిటి? అని ఆరా తీస్తే..ఇది రాణా స్పెషల్ రోల్ చేస్తున్న ఒక సినిమా గురించి. ఈ సినిమాలో అసలు రోల్ తమిళ స్టార్ హీరో అజిత్ ది. అజిత్ హీరోగా నటిస్తున్న 'ఆరంభం' అనే సినిమాలో రాణా ఒక ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు.

స్వతహాగా అజిత్ కు తమిళంలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్  ఉంది. దీంతో 'ఆరంభం' సినిమా గురించి చాలా మంది ఎదురు చూస్తున్నారు. అదిగాక ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నది 'విష్ణువర్ధన్' ఈ డైరెక్టర్ ఇది వరకూ అజిత్ తో 'బిల్లా' సినిమాను రూపొందించాడు. ఆ సినిమాను చాలా స్టైలిష్ గా తీశాడు అనే పేరు సంపాదించాడు విష్ణువర్ధన్. అలా విష్ణు-అజిత్ ల కాంబినేషన్ కు మంచి క్రేజ్ వచ్చింది. ఇప్పుడు మళ్లీ ఈ కాంబో రిపీట్ అవుతూ రూపొందిస్తున్న 'ఆరంభం' గురించి సహజంగానే మంచి అంచనాలు ఉండే అవకాశం ఉంది. ఈ విధంగా రాణా నటిస్తున్న సినిమా పై తమిళనాడులో భారీ అంచనాలున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు