బాలీవుడ్‌ లెజెండ్‌ను మెప్పించిన తెలుగమ్మాయ్‌

బాలీవుడ్‌ లెజెండ్‌ను మెప్పించిన తెలుగమ్మాయ్‌

సుధ కొంగర.. నిన్న రాత్రి నుంచి ఈ పేరు బాలీవుడ్లో మార్మోగిపోతోంది. ఈ రోజు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 'సాలా ఖదూస్‌' దర్శకురాలు ఆమే. నిన్న సాయంత్రమే ముంబయిలో బాలీవుడ్‌ సెలబ్రెటీల కోసం 'సాలా ఖదూస్‌' స్పెషల్‌ ప్రిమియర్‌ షో వేశారు.అక్కడ్నుంచే సినిమాకు చాలా మంచి టాక్‌ వచ్చింది. సిద్దార్థ్‌ సహా అందరూ ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సుధ డైరెక్షన్‌ గురించి తరణ్‌ ఆదర్శ్‌ సహా అందరూ ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. హిందీ, తెలుగు భాషల్లో విడుదల కాబోతున్న ఈ సినిమాతో సుధ బలమైన ముద్ర వేయబోతున్నట్లు స్పష్టమైంది. ఐతే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం.. సుధ అచ్చ తెలుగు అమ్మాయి కావడం.

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి ప్రాంతంలో పుట్టిన సుధ.. మణిరత్నం దగ్గర దర్శకత్వంలో ఓనమాలు నేర్చుకుంది. ఏడేళ్లు మణి దగ్గర దర్శకురాలిగా పని చేసిన సుధ.. తమిళ సినిమా 'ద్రోహి'తో దర్శకురాలిగా పరిచయమైంది. ఆ సినిమా ఓ మోస్తరుగానే ఆడింది. ఐతే ఓ నిరుపేద అమ్మాయి జాతీయ స్థాయిలో బాక్సింగ్‌ ఛాంపియన్‌ గా నిలవడంపై పత్రికల్లో వచ్చిన కథనాల నుంచి స్ఫూర్తి పొంది కథ రాసి తమిళంలో సినిమా తీయడానికి రెడీ అయింది. ఐతే బాలీవుడ్‌ లెజెండరీ డైరెక్టర్‌ రాజ్‌ కుమార్‌ హిరానికి ఈ కథ నచ్చి హిందీలో కూడా ఈ సినిమాను నిర్మించడానికి ముందుకొచ్చాడు. అలా మొదలైన సాలా ఖదూస్‌.. ఇప్పుడు బాలీవుడ్లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసేలా కనిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు