6.5 కోట్లా... సోగ్గాడి తస్సాదియ్యా!

 6.5 కోట్లా... సోగ్గాడి తస్సాదియ్యా!

'సోగ్గాడే చిన్నినాయనా'తో భారీ లాభాలని వెనకేసుకుంటోన్న నాగార్జున ఖజానా ఇంకా ఇంకా నిండుతూనే వుంది. ఈ చిత్రానికి ఫ్యామిలీ ఆడియన్స్‌ నుంచి వచ్చిన ఆదరణని చూసి దీని ప్రసార హక్కుల సొంతం చేసుకోవడం కోసం చాలా చానల్స్‌ పోటీ పడ్డాయి. అన్ని చానల్స్‌ కంటే ఎక్కువ కోట్‌ చేసిన జెమిని టీవీకి ఈ హక్కులు ఇచ్చేసారు.

ఆరున్నర కోట్ల రూపాయలకి తొలి విడత ప్రసార హక్కులని జెమిని సొంతం చేసుకున్నట్టు సమాచారం. ఈమధ్య శాటిలైట్‌ రైట్స్‌కి ఇచ్చే రేట్‌ తగ్గింది కానీ లేదంటే దీనికి ఇంకో రెండు కోట్లు వచ్చేసేవి. బండ్లు కట్టించుకుని మరీ ఈ చిత్రాన్ని చూడ్డానికి వచ్చిన జనం ఖచ్చితంగా టీవీలో వచ్చినప్పుడు కూడా సెట్లకి అతుక్కుపోతారనేది ఖాయం.

అందుకే దీనిపై ఇంత వెచ్చించడానికి జెమిని ఛానల్‌ వెనకాడలేదు. థియేట్రికల్‌గా వచ్చిన షేర్లతోనే నాగార్జునకి డబుల్‌ ప్రాఫిట్స్‌ వచ్చేసాయని అనుకుంటూ వుంటే ఇక ఈ రైట్స్‌ రూపంలో వచ్చిన పడిపోతున్న కోట్లతో లాభం ఇంకెంత అవుతుందో. ప్లానింగ్‌ సరిగ్గా వుండాలే కానీ ఎన్ని సినిమాలతో పోటీ వచ్చినా కానీ జనాన్ని థియేటర్లకి రాబట్టవచ్చునని నిరూపించిన సోగ్గాడే చిన్నినాయనా మీడియం బడ్జెట్‌ చిత్రాలు తీసే వారికి కొత్త ఉత్సాహాన్ని అందించింది. అదండీ సంగతి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు