గోపీచంద్‌ వదిలేసింది తను చేస్తున్నాడు

గోపీచంద్‌ వదిలేసింది తను చేస్తున్నాడు

గోపీచంద్‌తో భూపతి పాండ్యన్‌ దర్శకత్వంలో రూపొందాల్సిన సినిమా ఆగిపోయిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల పాటు షూటింగ్‌ చేసిన తర్వాత ఆ చిత్రాన్ని ఆపేశారు. భూపతి దగ్గర సరైన కథ లేకపోవడంతో గోపీచంద్‌ ఆ ప్రాజెక్ట్‌ వదిలేశాడు. అంతకుముందు హీరో విక్రమ్‌ ఇదే సినిమా చేస్తానని చెప్పి తర్వాత వద్దని తప్పుకున్నాడు.

ఇప్పుడా సినిమాని విశాల్‌తో తీస్తున్నాడు. విశాల్‌ ఈ చిత్రంలో డ్యూయెల్‌ రోల్‌ పోషిస్తున్నాడు. మరి ఇద్దరు హీరోలు కాదని వదిలేసిన ఈ చిత్రాన్ని విశాల్‌ ఎందుకు చేస్తున్నట్టు? ఆ హీరోలకి కుదరని నమ్మకం విశాల్‌కి ఎందుకు కలిగింది? అసలే ఈమధ్య హిట్స్‌ లేక డీలా పడిన విశాల్‌ తెలిసి తెలిసి తప్పు చేస్తున్నట్టయితే మాత్రం అందుకు తగ్గ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.

భూపతి పాండ్యన్‌ మాత్రం తన కథ మీద పూర్తి నమ్మకంతో ఉన్నాడు. తన సినిమా కాదని వెళ్లిన విక్రమ్‌, గోపీచంద్‌కి ఒక హిట్‌ వదిలేసుకున్నామనేది తెలియజెప్పాలని కసిగా పని చేస్తున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English