అప్పుడు ఆమెకూ ఇలాగే చెప్పావ్ నాగ్

అప్పుడు ఆమెకూ ఇలాగే చెప్పావ్ నాగ్

కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేయడానికి ఎప్పుడూ ముందుంటాడు నాగార్జున. ఈ మధ్యే డెబ్యూ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్లో ‘సోగ్గాడే చిన్నినాయనా’ చేశాడు నాగ్. ఐతే త్వరలోనే మరో యువ దర్శకురాలితో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు నాగ్. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రొడక్షన్ టీంలో పని చేసిన చునియా దర్శకత్వంలో నటిస్తానని అంటున్నాడు నాగ్. ఆమె దర్శకురాలిగా పరిచయమవుతున్న ‘పడేసావె’ను నాగ్ బాగా ప్రమోట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా ఆడియో ఫంక్షన్ సందర్భంగా తాను చునియా దర్శకత్వంలో ఓ సినిమా చేస్తానని ప్రకటించాడు నాగ్.

‘పడేసావె’ ఆడియో ఫంక్షన్లో నాగ్ మాట్లాడుతూ.. ‘‘చునియాపై అభిమానంతో వ‌చ్చిన వారి ఆశీస్సులే చునియాకు పెద్ద అండ‌. సినిమా నేను చూశాను. ఈ సినిమాకు ముందు చాలా ట్ర‌యాంగిల్ ల‌వ్ స్టోరీస్ వ‌చ్చినా ఇది అంద‌రికీ న‌చ్చుతుంది. ముఖ్యంగా మ‌గ‌వాళ్లు కచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది. ఆడ‌వాళ్లు వాళ్ల భ‌ర్త‌లు, బాయ్‌ఫ్రెండ్స్ ఎలా ఉండాల‌ని కోరుకుంటారో చెప్పే చిత్రమిది. ఇప్పుడు నా ఇంట్లో అమ‌ల నా గురించి ఏమ‌నుకుంటుందో బాగా తెలుస్తుంది. చునియా టాలెంటు మీద న‌మ్మ‌కంతో నేను ఈ సినిమాకు స‌పోర్ట్ చేశాను. సినిమా చూడ‌గానే.. నాకు కూడా ఓ స్క్రిప్ట్ చెబితే బావుంటుంద‌ని అనుకున్నాను. తర్వాత ఆమే వచ్చి సార్ ఓ స్క్రిప్ట్ ఉంది వింటారా అని అడిగింది. ఇప్పుడు చెబుతున్నాను. గేమ్ ఈజ్ ఆన్‌. సినిమా రిలీజ్ కాక ముందే నేను చెప్పేశాను. సినిమా రిలీజై, హిట్ట‌యిన త‌ర్వాత గేమ్ ఈజ్ ఆన్’’ అంటూ తాను చునియా దర్శకత్వంలో సినిమా చేయబోతున్న విషయాన్ని చెప్పకనే చెప్పేశాడు నాగ్.

ఐతే ఇంతకుముందు మరో లేడీ డైరెక్టర్ బి.జయ దర్శకత్వంలోనూ సినిమా చేయబోతున్నట్లు అన్నాడు కానీ.. అది కార్యరూపం దాల్చలేదు. మరి ప్రాజెక్టు ఏమవుతుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు