మహేష్‌ అలా.. పవనేంటి ఇలా?

మహేష్‌ అలా.. పవనేంటి ఇలా?

మెగాస్టార్‌ చిరంజీవి సినిమాల నుంచి వెళ్లిపోయాక తెలుగులో నెంబర్‌ వన్‌ హీరో ఎవరు అంటే చర్చ ఎప్పుడూ పవన్‌ కళ్యాణ్‌, మహేష్‌ బాబుల చుట్టూనే తిరుగుతుంది. ఫాలోయింగ్‌, క్రేజ్‌, రికార్డుల విషయంలో ఎవరికి ఎవరూ తీసిపోరు. వీళ్లిద్దరి సినిమాలు వచ్చాయంటే బాక్సాఫీస్‌ షేకైపోవాల్సిందే.

పవన్‌ కళ్యాణ్‌ 'అత్తారింటికి దారేది' సినిమాతో ఇండస్ట్రీ రికార్డు నెలకొల్పితే.. మహేష్‌ బాబు 'శ్రీమంతుడు'తో రికార్డుల్ని తిరగరాశాడు. వీళ్లిద్దరి తర్వాతి సినిమాల మీద కూడా భారీ అంచనాలే నెలకొన్నాయి. ఐతే ఆ తర్వాత వచ్చే భవిష్యత్‌ ప్రాజెక్టుల విషయంలోనే ఇద్దరూ భిన్నమైన దారిలో నడుస్తున్నారు. ఆశ్చర్యకరంగా పవన్‌, మహేష్‌లిద్దరూ తమిళ డైరెక్టర్లతోనే పని చేయబోతుండటం విశేషం.

మహేష్‌ బాబు సౌత్‌ ఇండియాలోనే టాప్‌ డైరెక్టర్లలో ఒకడైన అయిన మురుగదాస్‌ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాతో మహేష్‌ రేంజి మరో స్థాయికి వెళ్తుందనడంలో సందేహం లేదు. మంచి చాలా మంచి మూవ్‌ తీసుకున్నాడని అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఐతే పవన్‌ కళ్యాణ్‌ తర్వాతి సినిమా విషయంలోనే చాలా సందేహాలు నెలకొంటున్నాయి.

ఎస్‌.జె.సూర్య మీద ప్రస్తుతం కోలీవుడ్‌ జనాలకే నమ్మకం లేదు. ఒకప్పుడు వాలి, ఖుషి లాంటి సెన్సేషనల్‌ మూవీస్‌ తీసిన సూర్య.. గత దశాబ్ద కాలంలో ఓ మోస్తరు సినిమా కూడా తీయలేకపోయాడు. ఐతే మురుగదాస్‌ బ్లాక్‌బస్టర్ల మీద బ్లాక్‌బస్టర్లు ఇచ్చాడు. మహేష్‌ ఇలాంటి దర్శకుడిని ఎంచుకుంటే పవన్‌ మాత్రం ఫేడవుట్‌ అయిపోయిన డైరెక్టరుతో ప్రయాణం చేయబోతున్నాడు. మరి ఎవరు ఎలాంటి రిజల్ట్‌ అందుకుంటారో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు