ఆంటీ అంటున్నారని ఇలా తయారైందా ఏంటీ?

ఆంటీ అంటున్నారని ఇలా తయారైందా ఏంటీ?

నిన్న మొన్నటి వరకు టీనేజ్‌ పిల్ల వేషాలు వేసిన కలర్స్‌ స్వాతికి ఆ తర్వాత కాస్త ముదర పాత్రలే ఇస్తున్నారు. త్రిపుర సినిమాలో గృహిణి పాత్రని రక్తి కట్టించడానికి పట్టుబట్టి బరువు పెరిగిందట. దాంతో ఆంటీలా వున్నావని సోషల్‌ మీడియాలో ఎవరో తనని కామెంట్‌ చేస్తే స్వాతి చాలా హర్ట్‌ అయిపోయింది. అతడిని చెడా మడా తిట్టేసి ఆడవాళ్లని గౌరవించడం నేర్చుకోమంటూ క్లాస్‌ పీకేసింది. అయితే ఆంటీ అంటూ సంబోధించిన ఆ సంఘటనని స్వాతి మర్చిపోయినట్టు లేదు. అందుకే చిన్న పిల్లలా కనిపించడానికా అన్నట్టు ఐఐఎఫ్‌ఏ ఉత్సవానికి రెండు జడలు వేసుకుని టీనేజ్‌ అమ్మాయిలా ముస్తాబై వచ్చింది.

ఒక అయిదారేళ్ల క్రితం ఈ లుక్‌తో కనిపిస్తే క్యూట్‌గా అనిపించి వుండేదేమో కానీ ఇప్పుడు మాత్రం స్వాతి ఇలా రెండు జళ్లతో చాలా ఎబ్బెట్టుగా కనిపించింది. తన సాటి హీరోయిన్లంతా స్టయిలిస్టుల మీద ఖర్చు పెడుతూ లుక్‌కి చాలా ఇంపార్టెన్స్‌ ఇస్తోంటే స్వాతి ఇలాంటి స్టయిల్స్‌తో బయటకి వస్తే ఇక తననెవరు చూస్తారు? చెప్పుల దగ్గర్నుంచి చేతిలో పట్టుకున్న పర్స్‌ వరకు ఏదీ ట్రెండీగా లేకపోవడం చూస్తుంటే స్వాతికి పర్సనల్‌ స్టయిలిస్ట్‌ ఎవరూ లేరనే సంగతి అర్థమవుతోంది. పోటీలో ముందుండాలంటే ఇలాంటి విషయాల్లో ఖర్చుకి వెనకాడకూడదు స్వాతీ.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు