ఆ సినిమా 'ఛీ' అంటున్న రెబల్‌ స్టార్‌

ఆ సినిమా 'ఛీ' అంటున్న రెబల్‌ స్టార్‌

ప్రతి నటుడి కెరీర్లోనూ అన్నింటికంటే గొప్ప సినిమా ఉన్నట్లే.. అన్నింటికంటే చెత్త సినిమా కూడా ఒకటుంటుంది. ఫలానా సినిమాలో నటించడం నా అదృష్టం అని చెప్పడమే కాదు.. ఆ సినిమాలో ఎందుకు నటించానా అని ఫీలయ్యే సందర్భాలు కూడా ఉంటాయి.

ఐతే మంచి సినిమా గురించి గురించి ఓపెన్‌గా మాట్లాడినట్లు చెత్త సినిమా గురించి మనసు విప్పరు సినీ తారలు. ఐతే రెబల్‌ స్టార్‌ కృష్ణం రాజు మాత్రం తాను చేసిన చెత్త సినిమా గురించి ఓపెన్‌గా మాట్లాడేశారు. తాను చేసిన 'మళ్లీ పెళ్లి' చెత్త సినిమా అని.. అందులో ఎందుకు నటించానా అని చాలా ఫీలయ్యానని కృష్ణం రాజు వెల్లడించారు.

ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఫలానా సినిమాలో నటించాల్సింది కాదు అని మీరెప్పుడైనా ఫీలయ్యారా అని కృష్ణంరాజు అడగ్గా.. ''ఉంది. మళ్లీ పెళ్లి అనే సినిమా ఒకటి చేశాను. ఆ సినిమాలో నటించిన హీరో హీరోయిన్లు, దర్శకుడు, నిర్మాత.. మిగతా అందరూ కూడా నిజ జీవితంలోనూ మళ్లీ పెళ్లి చేసుకున్న వారే.

మరి నేనెందుకు ఆ సినిమాలో నటించానో.. నాతో ఎందుకు ఆ పాత్ర చేయించారో తెలియదు. ఆ సినిమాకు నాకో విగ్గు పెట్టారు. అది ఎంత అసహ్యంగా ఉందంటే.. మళ్లీ జీవితంలో విగ్గు పెట్టుకోకూడదని అనుకున్నాను. నా పెర్ఫామెన్స్‌ చూసి నేనేనా ఇది చేసింది అనిపించింది. ఇక సినిమాలే మానేద్దామా అన్న ఫీలింగ్‌ కలిగింది'' అని వెల్లడించారాయన.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు