మూడో సినిమాతో అట్టర్‌ఫ్లాపయ్యాడు

మూడో సినిమాతో అట్టర్‌ఫ్లాపయ్యాడు

సాయికుమార్‌ కొడుకు ఆది నటించిన తొలి రెండు సినిమాలు ప్రేమకావాలి, లవ్‌లీ కలెక్షన్స్‌ పరంగా ఫర్లేదనిపించుకున్నాయి. అయితే ఆ రెండు సినిమాల వల్ల హీరోగా అతనికి ఎలాంటి ఐడెంటిటీ లభించలేదు. అందుకే మూడో సినిమాకి ఎలాంటి క్రేజ్‌ రాలేదు.

సినిమాకి పబ్లిసిటీ కూడా సరిగా చేయకపోవడం వల్ల 'సుకుమారుడు' చిత్రానికి ఓపెనింగ్స్‌ కూడా రాలేదు. ఈ చిత్రంతో ఆదికి ఫస్ట్‌ ఫ్లాప్‌ వచ్చినట్టేనని అంటున్నారు. సినిమాకి తలా తోకా లేకపోవడం వల్ల ప్రేక్షకులని తీవ్ర అసహనానికి గురి చేస్తోందని, కామెడీ పండకపోవడం వల్ల ఈ చిత్రాన్ని ఆదరించడం కష్టమని రిపోర్ట్స్‌ వస్తున్నాయి.

పిల్ల జమీందార్‌ దర్శకుడు అశోక్‌ కూడా చాలా మంది దర్శకులలానే రెండో సినిమాతో ఫ్లాపయ్యాడు. ఇప్పుడు ఆది తన తదుపరి చిత్రాన్ని చాలా జాగ్రత్తగా ప్లాన్‌ చేసుకోవాలి. లేదంటే తర్వాత తిరిగి పుంజుకోవడానికి చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English