వామ్మో.. నమితను అలా చూడగలమా?

వామ్మో.. నమితను అలా చూడగలమా?

నమిత పేరెత్తగానే ఆమె భారీ అందాలే గుర్తుకొస్తాయి. కెరీర్‌ ఆరంభంలో కొంచెం పద్ధతిగానే కనిపించిన ఈ బొద్దుగుమ్మ.. ఆ తర్వాత పూర్తిగా గ్లామర్‌ గేట్లు తెరిచేసి తెరంతా అందాలు పరిచేసింది. ముఖ్యంగా తమిళంలో ఆమె చేసిన క్యారెక్టర్లన్నీ అదో టైపువే.

దాదాపు ఆరేడేళ్ల పాటు తమిళ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన నమిత.. అడపా దడపా తెలుగు ప్రేక్షకులనూ అలరించింది. ఐతే అరవ ఆడియన్స్‌ బొద్దుగా ఉంటే ఇష్టపడతారని మరీ అడ్డు అదుపు లేకుండా బరువు పెరిగిపోయిన నమిత.. చూడ్డానికి అసహ్యంగా తయారైంది. దీంతో కోలీవుడ్‌ జనాలు కూడా ఆమెను పక్కనబెట్టేశారు. మూణ్నాలుగేళ్లుగా నమిత అడ్రస్‌ లేదు.

హాట్‌: తాప్సీ కుమ్మిందిగా!


ఐతే ఈ మధ్యే బాగా బరువు తగ్గించుకుని సినిమాల్లోకి పునరాగమనం చేయడానికి రెడీ అంటూ మీడియా మందుకొచ్చింది నమిత. తెలుగోళ్లు పట్టించుకోలేదు కానీ.. తమిళంలో మాత్రం ఒకట్రెండు అవకాశాలు వచ్చాయి అమ్మడికి. అందులో ఒకటి.. 'పొట్టు. ఇదో హార్రర్‌ టైపు మూవీ. ఇందులో నమిత ఆడ అఘోరా పాత్ర పోషించబోతోందట.

నమితకు ఉన్న ఇమేజ్‌ ప్రకారం ఆమె ఈ వయసులోనూ గ్లామర్‌ రోల్‌ చేస్తే ఓకే కానీ.. మరీ ఇలా ఆఘోరా పాత్ర చేయడమే విడ్డూరంగా ఉంది. ఇలా ఆమెను చూడాలని ఎవ్వరూ కోరుకోరు. ఆ పాత్ర పోషించిందంటే మాత్రం నమిత కెరీర్‌ అంతటితో క్లోజ్‌ అయిపోయినట్లే లెక్క. ఐతే నిండా మునిగాక చలేంటి అన్నట్లు ఇప్పటికే అవకాశాలు తగ్గిపోయాయి కదా అని ధైర్యం చేస్తున్నట్లుంది నమిత.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు