హాట్‌: తాప్సీ కుమ్మిందిగా!

హాట్‌: తాప్సీ కుమ్మిందిగా!

దక్షిణాదిలో చెప్పుకోతగ్గ అవకాశాలు లేకపోయినా కానీ బాలీవుడ్‌లో ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకుంటోన్న తాప్సీ ఈ ఏడాదిలో బాలీవుడ్‌లో జెండా పాతేంగే అంటోంది. గత ఏడాది బేబీ సినిమాలో చేసిన చిన్న పాత్రతో తాప్సీ అంటే ఎవరనేది తెలిసింది. అందులో మార్షల్‌ ఆర్ట్స్‌ లేడీగా కనిపించి ఫైట్లు ఇరగదీసిన తాప్సీ ఇంతవరకు హిందీలో తన గ్లామర్‌ చూపించలేకపోయింది. తెలుగు చిత్ర సీమలో మొదటి సినిమాలోనే ఝుమ్మనిపించిన తాప్సీ ఆ తర్వాత పలు చిత్రాల్లో తన అందాల ప్రదర్శనతో రచ్చ చేసింది. కానీ అదృష్టం కలిసి రాక చేసిన సినిమాల్లో చాలా వరకు ఫ్లాపవడంతో తాప్సీ కష్టానికి తగ్గ ఫలితం రాకుండాపోయింది.

తర్వాత అవకాశాలు కూడా అడుగంటిపోవడంతో బాలీవుడ్‌కి మకాం మార్చిన తాప్సీ ఇప్పుడు తన అసలు ఆయుధాన్ని బయటకి తీసింది. న్యూ ఇయర్‌ స్పెషల్‌గా మాగ్జిమ్‌ మ్యాగజైన్‌కి ఫోటోషూట్‌ చేసిన తాప్సీ తనలోని మరో కోణాన్ని బాలీవుడ్‌కి చూపించింది. అంతే కాదు... మొన్న జరిగిన ఫిలింఫేర్‌ ఫంక్షన్‌కి వి నెక్‌ గౌనేసుకొచ్చి చూపరులని కట్టి పడేసింది. తాప్సీ ఈ రేంజిలో కుమ్మితే బాలీవుడ్‌లో జెండా పాతడం అంత కష్టమేం కాదనే చెప్పాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు